సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. బుధవారం నాడు ఆయన హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
కరీంనగర్: సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. బుధవారం నాడు ఆయన హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. భవిస్యత్తు కార్యాచరణపై అనుచరులతో చర్చించినట్టుగా ఆయన చెప్పారు. ఉద్యమకారులతో మాట్లాడాను, జిల్లా నేతలతో చర్చించినట్టుగా ఆయన గుర్తు చేశారు. మిలిటెంట్ ఉద్యమాలు కూడ చేస్తానని ఆయన తెలిపారు. రాజకీయాలకంటే కరోనాపై ఎక్కువగా ఆలోచించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
also read:దేవరయంజాల్ భూముల ఇష్యూ: ఈవో బదిలీ, కీలక ఫైల్స్ స్వాధీనం
సోమవారం నాడు హైద్రాబాద్ నుండి హుజూరాబాద్ కు ఈటల రాజేందర్ వెళ్లారు. అనుచరులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాసాయిపేట,హకీంపేట గ్రామాల్లో అసైన్డ్ భూములను ఆక్రమించుకొన్నారని ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుండి కేసీఆర్ తప్పించారు. మరో వైపు దేవర యంజాల్ లో ఈటల రాజేందర్ తో పాటు ఆయన అనుచరులు భూములను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారనే విషయమై ఐఎఎస్ లతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ చేస్తోంది.