మేయర్, చైర్మెన్ల ఎంపికకు పరిశీలకులను ప్రకటించిన కేసీఆర్

By narsimha lodeFirst Published May 5, 2021, 1:05 PM IST
Highlights

వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లకు మేయర్లు, ఐదు మున్సిపాలిటీలకు చైర్మెన్ల ఎంపిక కోసం పరిశీలకులను టీఆర్ఎస్ అధిష్టానం బుధవారం నాడు ప్రకటించింది. 

హైదరాబాద్: వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లకు మేయర్లు, ఐదు మున్సిపాలిటీలకు చైర్మెన్ల ఎంపిక కోసం పరిశీలకులను టీఆర్ఎస్ అధిష్టానం బుధవారం నాడు ప్రకటించింది. రెండు కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలీటీల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ నెల 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ చీఫ్  కేసీఆర్ పరిశీలకుల పేర్లను  మీడియాకు విడుదల చేశారు. 

వరంగల్ కార్పోరేషన్  -- మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ 

ఖమ్మం కార్పోరేషన్ -- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ నూకల నరేశ్ రెడ్డి.
    
కొత్తూరు మున్సిపాలిటీకి -- మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
    
నకిరేకల్ మున్సిపాలిటీ -- టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు

సిద్దిపేట మున్సిపాలిటీ  -- రవీందర్ సింగ్ (మాజీమేయర్ కరీంనగర్ ), వంటేరు ప్రతాప్ రెడ్డి (ఫారెస్టు డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్)

అచ్చంపేట మున్సిపాలిటీ-- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 

జడ్చర్ల  -- మేరెడ్డి శ్రీనివాస్ రెడ్డి (సివిల్ సప్లయీస్ కార్పోరేషన్ చైర్మన్) 

 

గురువారం నాడు సాయంత్రానికి ఎన్నికల పరిశీలకులు  ఆయా  ప్రాంతాలకు వెళ్లాలని కేసీఆర్ ఆదేశించారు.ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు, కార్పోరేటర్లతో సమావేశం నిర్వహించి మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చెర్మెన్ల ఎంపిక కోసం  చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. 
 

click me!