హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈ పేరుతో ఉన్న ముగ్గురు రాజేందర్ అభ్యర్ధుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి రవీందర్ తిరస్కరించారు. సరైన పత్రాలు లేని కారణంగా 19 నామినేషన్ పత్రాలను రిజెక్ట్ చేసినట్టుగా ఎన్నికల అధికారులు తెలిపారు.
కరీంనగర్:హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 19 నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేరును పోలిన ముగ్గురు రాజేందర్ అభ్యర్ధుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ravinder తిరస్కరించారు.
also read:Huzurbad Bypoll: ఈటల జమునకు బ్రహ్మరథం... బతుకమ్మ, బోనాలతో ఘన స్వాగతం
undefined
ఈ నెల 8వ తేదీన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓట్లను కొల్లగొట్టే ఉద్దేశ్యంతో ఈ. రాజేందర్ అనే పేరున్న ముగ్గురు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. రిపబ్లిక్ పార్టీ తరపున ఇమ్మడి రాజేందర్, న్యూ ఇండియా పార్టీ తరపున ఈసంపల్లి రాజేందర్, ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ తరపున ఇప్పలపల్లి రాజేందర్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ముగ్గురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి నామినేషన్లను తిరస్కరించారు. ఈటల రాజేందర్ పేరును పోలిన అభ్యర్ధుల నామినేషన్లను తిరస్కరించడంతో బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకొన్నారు.
huzurabad bypoll స్థానం నుండి 61 నామినేషన్లు దాఖలయ్యాయి. 19 nominations తిరస్కరించడంతో 42 నామినేషన్లు సక్రమమైనవిగా అధికారులు తేల్చారు. 92 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు.13 గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. 29 మంది అభ్యర్ధులు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగారు. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
ఇండిపెండెంట్లుగా బరిలో ఉంటున్న అభ్యర్ధులకు కమలం పువ్వు, కారును పోలిన గుర్తులు కేటాయించాలని కోరుతున్నారు. అయితే ఈ తరహ గుర్తులను కేటాయించవద్దని bjp, trsలు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరారు.
అసైన్డ్ భూములు, దేవాదాయశాఖకు చెందిన భూములను ఆక్రమించుకొన్నారనే కారణంగా etela rajender ను kcr తన మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేశారు. దీంతో ఈ ఏడాది జూన్ 12న హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజేందర్ రాజీనామా చేశారు. అదే నెల 14న ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు.ఈ నెల 30వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ రెండున ఓట్ల లెక్కింపు సాగనుంది.