కరోనాతో ఖాళీ అవుతున్న హైదరాబాద్.. ఏ మూలకు వెళ్లినా ‘‘ TO LET ’’ బోర్డులే

By Siva KodatiFirst Published Jul 5, 2020, 4:17 PM IST
Highlights

కరోనా దెబ్బతో అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు దిగజారిపోతున్నాయి. ఆ రంగం ఈ రంగం అని లేకుండా అన్ని రంగాలు కూడా కుదేలవుతున్నాయి. దీనిలో ఇంటి యజమానులు కూడా ఉన్నారు.

కరోనా దెబ్బతో అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు దిగజారిపోతున్నాయి. ఆ రంగం ఈ రంగం అని లేకుండా అన్ని రంగాలు కూడా కుదేలవుతున్నాయి. దీనిలో ఇంటి యజమానులు కూడా ఉన్నారు.

కరోనాతో ఎంతో మంది సొంతూళ్లకు వెళ్లిపోవడంతో గృహ యజమానుల బాధ వర్ణనాతీతం. హైదరాబాద్‌లో కరోనాకు ముందు... తర్వాతలా మారాయి. ఇంతకాలం మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం సాగింది.

Also Read:విజృంభిస్తున్న కరోనా: కేసీఆర్ ఎక్కడ...?

కానీ ఎప్పుడైతే కోవిడ్ 19 ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి సీన్ రివర్స్ అయ్యింది. హైదరాబాద్‌లో చుక్కలనంటే డిమాండ్ ఉండే అద్దె ఇళ్లు.. కరోనా కారణంగా to let బోర్డులతో దర్శనమిస్తున్నాయి.

నాడు విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం నగరాలకు వచ్చే వారి సంఖ్య భారీగా ఉండటంతో యజమానులు అద్దె ధరలు అమాంతం పెంచేశాడు. ఇటీవల గత మూడు నెలలుగా సరైన అద్దెలు లేక అవస్థలు  పడుతున్నారు. హైదరాబాద్‌లో సొంతిల్లు పేదవాడికి ఊహకు అందని అద్భుతం.

సొంతిల్లు ఉంటే అద్దెలతోనే బతికేయొచ్చన్నది కరోనాకు ముందున్న పరస్థితులు, జీవన చక్రం ఒక్కసారిగా తలకిందులైంది. ఒకప్పుడు చిన్న గది కావాలన్నా రూ.4 నుంచి రూ.5 వేలు, సింగిల్ బెడ్ రూం రూ.5 నుంచి రూ.10 వేలు, డబుల్ బెడ్ రూం రూ.10 నుంచి రూ.20 వేలు పలికాయి.

నగరంలో అద్దెకు ఇళ్లు దొరకడం కూడా కష్టమే. అలాంటిది కరోనా ధాటికి ఈ రంగం నష్టాలను మూటగట్టుకుంటోంది. వైరస్ వ్యాప్తితో పాటు, ఉపాధి, వ్యాపార అవకాశాలు కోల్పోయి, అత్యధిక మంది ఇంటి బాటపడుతున్నారు.

Also Read:ప్రైవేట్ ఆసుపత్రి నుండి నిమ్స్ కు డాక్టర్ సుల్తానా తరలింపు: చర్యలకు ఈటల ఆదేశం

ఇప్పుడు సగం ధరలకు అద్దెకు ఇస్తామన్నా, వచ్చే వారు లేక ఇళ్లముందు to let బోర్డులు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్‌కు విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చినవాళ్లు ఇళ్లు ఖాళీ చేసి స్వస్ధలాలకు వెళ్లిపోవడంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నగరంలో అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోనూ పరిస్ధితి తీసికట్టుగా మారింది. సామాన్యుల నుంచి పలు వ్యాపార సముదాయల వరకు ఉపాధి కోల్పోయి ఇళ్లు, కార్యాలయాలు ఖాళీ చేస్తున్నారు. 

click me!