కరోనా ఎఫెక్ట్: తెలంగాణ సరిహద్దుల మూసివేత, నిలిచిపోయిన వాహనాలు

By narsimha lodeFirst Published Mar 23, 2020, 2:25 PM IST
Highlights

లాక్ డౌన్ ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దులను మూసివేసింది. తొలుత  జనతా కర్ప్యూ దృష్ట్యా ఈ నెల 22వ తేదీ వరకు సరిహద్దులను మూసివేశారు 

నల్గొండ: లాక్ డౌన్ ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దులను మూసివేసింది. తొలుత  జనతా కర్ప్యూ దృష్ట్యా ఈ నెల 22వ తేదీ వరకు సరిహద్దులను మూసివేశారు అయితే కరోనాను వ్యాప్తి చెందకుండా ఉంచేందుకు వీలుగా ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ను తెలంగాణ సర్కార్ ప్రకటించింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి.

జనతా కర్ఫ్యూను పురస్కరించుకొని ఈ నెల 21వ తేదీ రాత్రి నుండే తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాలను మూసివేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దులను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏపీ రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దును మూసివేసింది ప్రభుత్వం.

Also read:కరోనా ఎఫెక్ట్: లాక్‌డౌన్ జిల్లాల్లో సేవలు నిలిపివేసిన ఓలా, ఉబేర్

ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడ కర్ణాటక రాష్ట్ర సరిహద్దును కూడ మూసివేశారు పోలీసులు. ఇక నిజామాబాద్ జిల్లా సరిహద్దులో కూడ మహారాష్ట్ర సరిహద్దులను కూడ మూసివేశారు.తెలంగాణ రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుండి నిత్యావసర సరుకులను రవాణా చేసే వాహనాలను మాత్రమే అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కూరగాయలు, పాలు, మందులు ఇతరత్రా అత్యవసర సరుకులు తరలించే వాహనాలకు మాత్రమే తెలంగాణలోకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

కోదాడకు సమీపంలోని ఏపీ రాష్ట్ర సరిహద్దు వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేందుకు రోడ్డు వెంట భారీగా వాహనాలను నిలిచిపోయాయి.

click me!