వివాదాస్పద స్థలంలో మాజీ మావోయిస్టు అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కానీ పోలీసులు దానికి అడ్డుచెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
మాజీ మావోయిస్టు అంత్యక్రియల్లో వివాదం నెలకొనడంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఇల్లందుకు చెందిన మాజీ మావోయిస్టు అనారోగ్యంతో మరణించాడు. అయితే అతడి కుమారుడు ఓ వివాదాస్పద స్థలంలో దహన సంస్కారాలు జరిపేందుకు మృతదేహాన్ని తీసుకొని వచ్చాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అసలేం జరిగిందంటే ?
ఇల్లందుకు చెందిన సమ్మయ్య గతంలో మావోయిస్టుగా పని చేశారు. అయితే జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని ప్రభుత్వం పిలుపునివ్వడంతో 2008లో ఆయన తిరిగి జనాల్లోకి వచ్చారు. దీంతో ప్రభుత్వం అతడి జీవనోపాధి కోసం కొంత భూమిని అందించింది. కానీ అప్పుడు కేటాయించిన ఆ భూమిని ప్రభుత్వ అవసరాల కోసం తీసుకొంది. మరో చోట ఆయనకు భూమిని కేటాయించింది. కానీ ఆ భూమిని ఇల్లందుకు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు ఆక్రమించాడని కొన్నేళ్ల నుంచి సమయ్య ఆరోపిస్తూ వస్తున్నాడు.
'రామచరితమానస్ ఓ సైనైడ్..' బీహార్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలు
దీని కోసం అధికారుల చుట్టూ, నాయకులు చుట్టూ తిరుగుతున్నాడు. ఆ భూమిని తిరిగి పొందేందుకు పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో గతంలో ఒక సారి ఇల్లందు తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. మరో సారి వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. దీంతో స్థానికులు నచ్చజెప్పడంతో తన నిరసనను విరమించుకున్నాడు.
జుట్టు కత్తిరించి.. ముఖానికి నల్లరంగు పూసి.. గ్రామంలో ఊరేగించి..
కాగా.. ఆయన ఓ వైపు పోరాటం సాగిస్తున్న క్రమంలోనే అనారోగ్యానికి గురై ఇంటి దగ్గర చనిపోయాడు. అయితే తన తండ్రి పోరాటం సాగించిన భూమిలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుమారుడు రమేష్ నిర్ణయం తీసుకున్నాడు. ఆ స్థలంలోకి సమ్మయ్య మృతదేహాన్ని తీసుకొని వచ్చాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులకు అక్కడికి చేరుకున్నారు. వివాదాస్పద స్థలంలో అంత్యక్రియలు జరపకూడదని నచ్చజెప్పారు. దీంతో రెండు వర్గాల మధ్య కొంత సేపు వాదనలు జరిగింది. ఈ క్రమంలో విసుగు చెందిన సమయ్య కుటుంబ సభ్యులు శవాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మృతదేహానికి మీరే అంత్యక్రియలు చేసుకోండని తేల్చి చెప్పారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో వర్షం కురిసింది. దీంతో వానలోనే డెడ్ బాడీ తడిసింది.