తెలంగాణ నుంచి పోటీ చేయండి.. ప్రధాని మోడీకీ రాష్ట్ర బీజేపీ ఆహ్వానం...

By team teluguFirst Published Jan 11, 2023, 2:13 PM IST
Highlights

తెలంగాణ నుంచి ప్రధాని నరేంద్ర మోడీని లోక్ సభకు పోటీ చేయించాలని రాష్ట్ర బీజేపీ భావిస్తోంది. దీని కోసం త్వరలోనే జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానికి లేఖ రాయాలని చూస్తోంది. 

దక్షిణాదిలో అడుగుపెట్టాలని, ముఖ్యంతా తెలంగాణలో బలంగా పాగా వేయాలని బీజేపీ ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తోంది. తెలంగాణలో మూడో సారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీఆర్ఎస్ కు అడ్డుకట్ట వేయాలంటే ఇక్కడి నుంచి మోడీని పోటీ చేయించాలని రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తోంది. 

నాకు పదెకరాల భూమి ఉన్నా పిల్లనివ్వడం లేదు.. అమ్మాయిని వెతకండి అంటూ ఎమ్మెల్యేకు యువకుడి ఫోన్ కాల్..

వచ్చే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని ఇక్కడి నుంచి పోటీ చేయించడానికి, ఈ విషయంలో అధికారికంగా ఆయనను ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, బీజేపీ నేత ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 16,17 తేదీల్లో ఢిల్లీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని ప్రధానికి లేఖ రాస్తానని చెప్పారు.

ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం.. వివరాలు ఇవే..

డిసెంబర్ లో జరిగే రాష్ట్ర ఎన్నికలకు ముందే.. ఇక్కడి నుంచి పోటీ చేస్తానని మోడీ ప్రకటిస్తే తెలంగాణ బీజేపీ క్యాడర్ కు ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు, ఇక్కడ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. దీని వల్ల తెలంగాణ దక్షిణాదికి గేట్‌వే అని,  దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిని బీజేపీ కోరుకుంటోందని, దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు సేవ చేస్తామని ప్రధాని మోదీ బలమైన, శక్తివంతమైన సందేశాన్ని పంపే అవకాశం ఉంటుందని అనుకుంటోంది. 

ప్రధాని మోడీ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తే ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ అగ్ర నాయకత్వం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతపై హైకోర్టులో పిటిషన్..

మౌలిక సదుపాయాల కల్పన, పార్లమెంటరీ బోర్డులో డాక్టర్ కె.లక్ష్మణ్ వంటి సీనియర్ నేతలను నియామకం, హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించడం, అనేక అభివృద్ధి కార్యక్రమాల ప్రకటన, ముఖ్యంగా రైలు, రహదారి ప్రాజెక్టులను ప్రకటించడం ద్వారా ప్రధాని దక్షిణాదికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుస్తున్నారని తెలుస్తోంది. 

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రైతుల పిటిషన్‌పై విచారణ.. స్టే ఇచ్చేందుకు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ..

జనవరి 19న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ ను సందర్శించనున్నారు. సికింద్రాబాదు-మహబూబ్ నగర్ మధ్య రూ.1,410 కోట్లతో డబుల్ రైల్వే లైన్ ను ప్రారంభించనున్నారు. మహబూబ్ నగర్ నుంచి కర్ణాటకలోని చించోలి మధ్య 103 కిలోమీటర్ల జాతీయ రహదారి 167ఎన్ తో సహా రూ.1,850 కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

click me!