ఆ పోలీసులకు వాంతులు విరేచనాలు ఎందుకంటే ?

First Published Jun 19, 2017, 3:29 PM IST
Highlights

వారంతా పోలీసు శిక్షణ పొందుతున్న వారు. శిక్షణ కేంద్రంలో 250 మంది వరకు ఉంటారు. ఉన్నట్లుండి వారిలో కొందరికి వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో హుటాహుటిన వారిని దావాఖానాకు తీసుకుపోయారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు. వారికి వాంతులు, విరేచనాలు ఎందుకయ్యాయంటే

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ ట్రైనింగ్ సెంటర్ లో 250 మందికి పోలీసు కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అందులో   35 మంది ట్రైనీ కానిస్టేబుళ్లు అస్వస్తతకు గురయ్యారు. వారికి వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. దీంతో వారిని చికిత్స కోసం జిల్లాలోని రిమ్స్ కు తరలించారు. వారంతా సేఫ్ గానే ఉన్నట్లు వైద్యలు ప్రకటించారు.

ఆదివారం కావడంతో నిన్న మద్యాహ్నం మాంసాహారం, రాత్రి పప్పు భోజనం చేసినట్లు ట్రైనీ కానిస్టేబుళ్లు చెబుతున్నారు. మరి ఫుడ్ పాయిజన్ అయిందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఒకవేళ అదే అయితే మొత్తం మందిలో 35 మందికే ఎందుకు వాంతులు, విరేచనాలు వచ్చాయన్నది తేలాల్సి ఉంది.

click me!