హైద్రాబాద్‌లో మింట్ కాంపౌండ్ లో గన్ మిస్ ఫైర్: కానిస్టేబుల్ రామయ్య మృతి

Published : Jun 29, 2023, 11:05 AM ISTUpdated : Jun 29, 2023, 12:33 PM IST
 హైద్రాబాద్‌లో మింట్ కాంపౌండ్ లో  గన్ మిస్ ఫైర్: కానిస్టేబుల్ రామయ్య మృతి

సారాంశం

హైద్రాబాద్ లో మింట్ కాంపౌండ్ గన్ మిస్ ఫైర్ కావడంతో  కానిస్టేబుల్  రామయ్య మృతి చెందాడు. తుపాకీ శుభ్రం  చేస్తున్న సమయంలో గన్ మిస్ ఫైరయింది. 

 

హైదరాబాద్: నగరంలోని మింట్ కాంపౌండ్ లో గురువారంనాడు  తుపాకీ మిస్ ఫైర్ కావడంతో   కానిస్టేబుల్  రామయ్య  మృతి చెందాడు.  మింట్ కాంపౌండ్ లో  రామయ్య అనే కానిస్టేబుల్ సెక్యూరిటీ విభాగంలో  విధులు నిర్వహిస్తున్నాడు.  ఇవాళ  ఉదయం  విధుల్లో భాగంగా   తుపాకీని  శుభ్రం  చేస్తున్న సమయంలో  తుపాకీ  మిస్ ఫైర్ అయింది.  దీంతో బుల్లెట్ గాయమైన  కానిస్టేబుల్ రామయ్య అక్కడికక్కడే  మృతి చెందాడు.రామయ్య   స్వస్థలం మంచిర్యాల జిల్లా.

గతంలో  కూడ రెండు తెలుగు  రాష్ట్రాల్లో  తుపాకీ మిస్ ఫైర్ అయిన ఘటనలు  చోటు  చేసుకున్నాయి.   ఒంగోలు జిల్లాలోని రాజాపానగల్  యూనియన్ బ్యాంకు  కరెన్సీ టెస్టింగ్  సెంటర్ లో  తుపాకి మిస్ ఫైర్ అయి ఎస్‌పీఎఫ్  కానిస్టేబుల్  వెంకటేశ్వర్లు  మృతి చెందాడు. ఈ ఘటన ఈ నెల  5వ తేదీన  జరిగింది. 

2022  ఫిబ్రవరి  13న  వరంగల్ జిల్లాకు  చెందిన  సంతోష్ యాదవ్  చేతిలోని గన్ మిస్ ఫైర్ అయింది.  ఈ ఘటనలో  సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు.  డ్రిల్ సమయంలో ఈ ఘటన   చోటు  చేసుకుంది. 2020  సెప్టెంబర్ 11న  ఎపీఎస్‌పీ  రెండో బెటాలియన్  కానిస్టేబుల్  గన్ మిస్ ఫైర్ అయింది.  ఈ ఘటనలో  రాజు అనే కానిస్టేబుల్ మృతి చెందాడు.

ఈ ఏడాది మార్చి 28న  గన్ మిస్ ఫైర్ కారణంగా  ఏఆర్ కానిస్టేబుల్   రాజశేఖర్ కుడి కన్నుకు గాయమైంది.  2022 నవంబర్ 8న  కొమరం భీమ్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో  గన్ మిస్ ఫైర్  కారణంగా కానిస్టేబుల్ రజనీకుమార్  మృతి చెందాడు.


 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?