తాగొద్దన్నందుకు.. భార్యపై కొడవలితో దాడి చేసిన భర్త..

Published : Jun 29, 2023, 10:33 AM IST
తాగొద్దన్నందుకు.. భార్యపై కొడవలితో దాడి చేసిన భర్త..

సారాంశం

మద్యం తాగొద్దు అన్నందుకు భార్య మీద కొడవలితో దాడి చేశాడో భర్త. కొడవలి ఆమె తలలో ఇరుక్కోవడంతో అక్కడినుంచి పారిపోయాడు. 

సిరిసిల్ల : మందు తాగొద్దని అన్నందుకు భార్య మీద కొడవలితో దాడి చేశాడు ఓ భర్త. ఈ ఘటన తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది. బుధవారం నాడు మండల కేంద్రంలో ఒగ్గు మల్లేష్ అనే వ్యక్తి భార్య మీద కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మీద స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

స్థానికంగా ఉండే ఒగ్గు మల్లేష్, నిర్మల భార్యాభర్తలు. మల్లేష్ మద్యానికి అలవాటుపడ్డాడు. ఈ అలవాటుతో ఇంట్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండడంతో భార్య నిర్మల కొద్ది రోజులుగా తాగుడు మానేయాలంటూ భర్తని అడుగుతోంది.  దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది... సాయిచంద్ మృతిపై మంత్రులు కేటీఆర్, హరీష్ రావు దిగ్భ్రాంతి...

బుధవారం నాడు కూడా ఇలాగే జరిగిన గొడవలో.. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. దీంతో కోపోద్రిక్తుడైన మల్లేష్ భార్య మీద కొడవలితో దాడి చేశాడు. ఈ దాడితో కొడవలి నిర్మల తలలోకి చొచ్చుకు పోయింది. వెంటనే ఆమె బాధతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. అప్పటికే మల్లేష్ అక్కడి నుంచి పారిపోయాడు.

తలలో కొడవలితో ఉన్న నిర్మలను స్థానికులు జిల్లా ప్రభుత్వాసుపత్రికి 108 వాహనంలో చికిత్స కోసం తరలించారు. అక్కడి వైద్యులు చి మెరుగైన చికిత్స కోసం ఆమెను అక్కడి నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు అంటున్నారు.  

PREV
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?