ఈటల హత్యకు సుఫారీ ఆరోపణలు: రాజేందర్‌తో భేటీ కానున్న మేడ్చల్ డీసీపీ

By narsimha lode  |  First Published Jun 29, 2023, 10:57 AM IST


మాజీ మంత్రి ఈటల  రాజేందర్ తో  మేడ్చల్ డీసీపీ  సందీప్ రావు  ఇవాళ  సమావేశం కానున్నారు. ఈటల రాజేందర్  భద్రత విషయమై  పోలీస్ శాఖ  ఇవాళ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.


హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో  మేడ్చల్  డీసీపీ సందీప్ రావు  గురువారం నాడు సమావేశం కానున్నారు. ఈటల రాజేందర్ ను  చంపేందుకు  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కౌశిక్ రెడ్డి  సుఫారీ ఇచ్చారని  ఈటల జమున ఆరోపణలు  చేశారు. దీంతో  ఈటల రాజేందర్ భద్రతపై  పోలీస్ శాఖ  సమీక్షిస్తుంది. 

నిన్ననే  ఈటల రాజేందర్ నివాసానికి  మేడ్చల్  డీసీపీ  సందీప్ రావు  వెళ్లారు.  అయితే  అప్పటికే  ఈటల రాజేందర్  ఇంటి నుండి వెళ్లిపోయారు.  ఈటల రాజేందర్ నివాసం  పరిసరాల్లో   భద్రతను  మేడ్చల్ డీసీపీ  సందీప్ రావు  పరిశీలించారు.  ఇవాళ  మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో  మేడ్చల్  డీసీపీ సందీప్ రావు  సమావేశం కానున్నారు. 

Latest Videos

మాజీ మంత్రి ఈటల రాజేందర్ భద్రత విషయమై  తెలంగాణ ప్రభుత్వం  కూడ సీరియస్ గా తీసుకుంది.  ఈ విషయమై  తెలంగాణ మంత్రి కేటీఆర్  డీజీపీ అంజనీకుమార్ తో  నిన్న  ఫోన్ లో మాట్లాడారు.  ఈటల రాజేందర్  భద్రత విషయమై  ఆరా తీశారు.  ఈటల రాజేందర్ కు భద్రతను కల్పించాలని   మంత్రి కేటీఆర్  డీజీపీని ఆదేశించారు.  దీంతో  పోలీస్ ఉన్నతాధికారులు  రంగంలోకి దిగారు.  నిన్ననే  మేడ్చల్ డీసీపీ  సందీప్ రావు  షామీర్ పేటలోని  ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లి  భద్రతను పరిశీలించారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను హత్య చేయడానికి  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కౌశిక్ రెడ్డి  సుఫారీ  ఇచ్చారని  ఈటల జమున  ఆరోపణలు  రాష్ట్రంలో  కలకలం  రేపుతున్నాయి.  ఈటల రాజేందర్ సతీమణి  జమునతో  పాటు  ఈటల రాజేందర్ కూడ   ఇదే ఆరోపణలు  చేశారు.  ఈ ఆరోపణలను  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  పాడి కౌశిక్ రెడ్డి  తోసిపుచ్చారు.  హత్య రాజకీయాలు చేయడం తనకు  అలవాటు లేదన్నారు.  ఈ నైజం ఈటల రాజేందర్ కే ఉందని  కౌశిక్ రెడ్డి మీడియా వేదికగా  ఆరోపణలు  చేశారు. 

ఈటల రాజేందర్ ను హత్య  చేసేందుకు  సుఫారీ  ఇచ్చారని  ప్రచారం సాగడంతో  కేంద్ర ప్రభుత్వం  కూడ  వై కేటగిరి భద్రతను  కేటాయించాలని  భావిస్తుందని  సమాచారం. ఈ తరుణంలో  ఈటల రాజేందర్  భద్రత విషయంలో  రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకరించింది.

also read:ఈటల హత్యకు సుఫారీ ఆరోపణలు: రాజేందర్ ఇంటికి మేడ్చల్ డీసీపీ

ఇవాళ  మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో  మేడ్చల్ డీసీపీ  సందీప్ రావు సమావేశం కానున్నారు.  భద్రతపై  ఈటల రాజేందర్ తో చర్చించనున్నారు.  సుఫారీ ఆరోపణల విషయమై  ఆరా తీసే అవకాశం ఉంది. మరోవైపు  ఈ విషయమై  పోలీస్ ఉన్నతాధికారులకు  నివేదిక  ఇవ్వనున్నారు డీసీపీ.  ఈ నివేదిక ఆధారంగా  తెలంగాణ ప్రభుత్వం  ఈటల రాజేందర్  భద్రత విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

click me!