కొత్త సంవత్సరంలోనే: టీపీసీసీ చీఫ్ కొత్త నేత ఎంపిక

By narsimha lodeFirst Published Dec 30, 2020, 3:53 PM IST
Highlights

టీపీసీసీ చీఫ్ ఎంపిక కొత్త ఏడాది (2021) లోనే జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. టీపీసీసీకి కొత్త  బాస్ ను ఎంపిక చేసే ప్రక్రియను పార్టీ నాయకత్వం ప్రారంభించింది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకొంది.
 

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఎంపిక కొత్త ఏడాది (2021) లోనే జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. టీపీసీసీకి కొత్త  బాస్ ను ఎంపిక చేసే ప్రక్రియను పార్టీ నాయకత్వం ప్రారంభించింది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకొంది.

టీపీసీసీ చీఫ్ ఎంపిక కోసం రాష్ట్రంలోని సుమారు 165 మంది పార్టీ నేతల నుండి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్  అభిప్రాయాలను సేకరించారు.

also read:జానారెడ్డితో మరోసారి సంప్రదింపులు, ఢిల్లీకి జీవన్ రెడ్డి: టీపీసీసీ చీఫ్ ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్ష్

మరో వైపు పార్టీ సీనియర్లతో పార్టీ నాయకత్వం చర్చలు జరుపుతోంది.  జానారెడ్డితో పాటు, మరికొందరు సీనియర్ల అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకొంది.

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం ఢిల్లీకి పిలిపించింది.  టీపీసీసీ చీఫ్ పదవి రేసులో  రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి.

రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నందున  కొత్త సంవత్సరంలోనే తెలంగాణ పీసీసీకి కొత్త నేతను ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల రాష్ట్ర ఇంచార్జీ మాణికం ఠాగూర్ ప్రకటించారు. కొత్త సంవత్సరంలో ఏ రోజున కొత్త నేత విషయాన్ని ప్రకటిస్తారో మాత్రం స్పష్టత ఇవ్వలేదు.


 

click me!