మందుబాబులకు గుడ్‌న్యూస్: రేపు అర్ధరాత్రి వరకు లిక్కర్ షాపులు ఓపెన్

Published : Dec 30, 2020, 03:01 PM ISTUpdated : Dec 30, 2020, 03:10 PM IST
మందుబాబులకు గుడ్‌న్యూస్: రేపు అర్ధరాత్రి వరకు లిక్కర్ షాపులు ఓపెన్

సారాంశం

మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫరిచ్చింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. బార్లు, క్లబ్బులకు రాత్రి 1 గంట వరకు అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్: మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫరిచ్చింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. బార్లు, క్లబ్బులకు రాత్రి 1 గంట వరకు అనుమతి ఇచ్చింది.

 

కొత్త సంవత్సరం వేడుకలను బహిరంగంగా నిర్వహించడంపై పోలీసులు నిషేధించారు. గేటేడ్ కమ్యూనిటీ హాల్స్ లో కూడ నూతన సంవత్సర వేడుకలపై బ్యాన్ విధించారు.

అయితే మద్యం విక్రయాలకు మాత్రం తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ నెల 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు  మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు క్లబ్బులు, పబ్ లకు  ఈ నెల 31వ తేదీ రాత్రి 1 గంట వరకు  అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

కరోనా నేపథ్యంలో  బహిరంగంగా పార్టీలు చేయడంపై  పోలీసులు ఆంక్షలు విధించారు. స్టార్ హాటల్స్  కు రోజువారీ కార్యక్రమాలకు యధావిధిగా అనుమతి ఇస్తున్నట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions
Telangana: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం