ఈ నెల 6 నుండి రేవంత్ పాదయాత్ర: ఇతర నేతల షెడ్యూల్ కోరిన మాణిక్ రావు ఠాక్రే

By narsimha lode  |  First Published Feb 4, 2023, 3:57 PM IST

పాదయాత్ర నిర్వహించే నేతలు  షెడ్యూల్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే  కాంగ్రెస్ పార్టీ నేతలను  కోరారు. ఇవాళ గాంధీ భవన్ లో పార్టీ సీనియర్లతో  ఆయన సమావేశమయ్యారు. 
 


హైదరాబాద్: ఈ నెల 6వ తేదీన  మేడారం సమ్మక్క, సారలమ్మ  ఆదలయం నుండి  రేవంత్ రెడ్డి  పాదయాత్ర  ప్రారంభం కానుందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ   మాణిక్ రావు  ఠాక్రే  చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రే  శుక్రవారం నాడు  రాత్రి హైద్రాబాద్ కు  చేరుకున్నారు.  ఇవాళ ఉదయం  గాంధీ భవన్ లో  కాంగ్రెస్ సీనియర్లతో  మాణిక్ రావు ఠాక్రే సమావేశమయ్యారు.  హత్ సే హత్ జోడో  యాత్రల నిర్వహణపై  మాణిక్ రావు ఠాక్రే చర్చించారు.  పార్టీ సీనియర్లు  ఏఏ ప్రాంతాల నుండి  పాదయాత్రలు  నిర్వహిస్తారనే విషయమై  ఠాక్రే  అడిగారు.  

Latest Videos

టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  మేడారం నుండి  పాదయాత్ర  నిర్వహించాలని  నిర్ణయం తీసుకున్నారు.  ఈ నెల  6వ తేదీ నుండి  రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుంది.  తొలి విడతలో  రేవంత్ రెడ్డి  60  రోజుల పాటు  50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  రేవంత్ రెడ్డి  పాదయాత్ర  నిర్వహించేలా రూట్  మ్యూప్  ను సిద్దం  చేసుకున్నారు.  ఈ నెల  6న రేవంత్ రెడ్డితో  కలిసి  మాణిక్ రావు ఠాక్రే పాదయాత్రను  ప్రారంభిస్తారు. 

రాష్ట్రానికి చెందిన సీనియర్లు  కూడా  పాదయాత్రకు ప్లాన్  చేసుకుంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  భారత్  జోడో యాత్రకు  కొనసాగింపుగా   ఆయా నియోజకవర్గాలు,.  జిల్లాల్లో  హత్  సే హత్  జోడో  పేరుతో  పాదయాత్రలు నిర్వహించాలని  కాంగ్రెస్ పార్టీ  నిర్ణయించింది.  ఇందులో భాగంగానే   తెలంగాణ రాష్ట్రంలో  రేవంత్ రెడ్డి  పాదయాత్ర  ఈ నెల  6వ తేదీన   ప్రారంభించనున్నారు. గత  నెలలోనే రేవంత్ రెడ్డి  పాదయాత్ర ప్రారంభించాలని  రంగం సిద్దం  చేసుకున్నారు. కానీ  కొన్ని కారణాలతో  పాదయాత్ర  గత మాసంలో  ప్రారంభించలేదు . ఈ నెల  6వ తేదీన  రేవంత్ రెడ్డి  పాదయాత్రను ప్రారంభించనున్నారు. 

also read:ఈ నెల 6 నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర: ములుగు నుండి ప్రారంభం

హత్ సే హత్ జోడో  పేరుతో  పార్టీ నేతలు  ఎక్కడి నుండి పాదయాత్రలు  ప్రారంభించనున్నారనే విషయమై  మాణిక్ రావు ఠాక్రే  పార్టీ నేతలతో చర్చించారు. రూట్ మ్యాప్ ల గురించి ఠఆక్రే  ఆరా తీశారు.  మరో వైపు రాష్ట్రంలో  రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై  కూడా సీనియర్ నేతలతో  మాణిక్ రావు ఠాక్రే  చర్చించారు. 
 

click me!