అస్త్ర సన్యాసం చేసి పారిపోయేవాళ్లం కాదు.. కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ సెటైర్లు.. అభ్యంతరం తెలిపిన భట్టి..

By Sumanth KanukulaFirst Published Feb 4, 2023, 3:38 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. 

తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నేడు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఈ క్రమంలోనే మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ది గురించి వివరించారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. మునుగోడులో ఉప ఎన్నిక జరిగిన నేపథ్యంలో తమ పార్టీ గెలుపు కోసం అందరం కలిసి పనిచేశామని అన్నారు. ఎన్నికల జరుగుతున్న చోట రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉండాలని అన్నారు. గుజరాత్‌లో ఎన్నికలుంటే వాళ్ల నాయకుడు పక్క నుంచి వెళ్లిపోయారని విమర్శించారు. తాము అస్త్ర సన్యాసం చేసి పారిపోయేవాళ్లం కాదని అన్నారు. తాము యుద్దానికి భయపడమని చెప్పారు. 

అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ మతం పేరు మీద విద్వేషాలను రెచ్చగొడుతుంటే.. ఇది ప్రజలు కోరుకున్న స్వాతంత్య్రం కాదని  రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు.

Also Read: అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని ప్రచారం చేస్తాం.. తెలంగాణపై కేంద్రానికి కక్ష ఎందుకు?: కేటీఆర్

అయితే తాను మునుగోడు ఎన్నికలను రిఫర్ చేయలేదని అన్నారు. తాను గుజరాత్‌ ఎన్నికల గురించి మాట్లాడనని చెప్పారు. ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షం ప్రజల్లో విశ్వాసం కలిపించడంలో విఫలమైందని  విమర్శించారు. అందుకే దేశ ప్రజలు వాళ్లని తిరస్కరిస్తున్నారని అన్నారు. వాళ్ల నాయకుడు మంచివాడేనని వాళ్లు అనుకుంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు.  
 

click me!