బాలింతల మరణాలపై హెచ్చార్సీకి ఫిర్యాదు

First Published Apr 27, 2017, 8:33 AM IST
Highlights

ఆసుపత్రులలో వైద్యం మెరుగుపరిచేందుకు, అధునిక పరికరాలు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, టిఆర్ ఎస్ నేతలే గులాబీ కూలి చేయాలి

 

 కోఠి  ప్రభుత్వాసుపత్రిలో బాలింతల వరస మరణాలపై కాంగ్రెస్ పార్టీ నేడు తెలంగాణా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్( హెచ్చార్సీ)కు పిర్యాదు చేసింది.

 

ఆసుపత్రుల్లో సదుపాయాలు లేక, వైద్యం అందక నే బాలింతలు చనిపోతున్నారని, .ఆసుపత్రులను స్థితిగతులను అధ్యయన చేసేందుకు ఒక  కమిటీ వేయాలని  గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు నేరెళ్ల శారద నాయకత్వంలో మహిళా కాంగ్రె స్ నాయకులు హెచ్చార్సీని కోరారు.

 

 ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే  బాలింతలు చనిపోతున్నారని చెబుతూ ఆసుప్రతులలో  ఉన్న దారుణ పరిస్థితుల మీద ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటుచేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని వారు హెచ్చార్సీని కోరారు.

 

కోఠి ప్రసూతి ఆసుపత్రులో చనిపోయిన వారికి రు.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, నిర్లక్ష్యం వహించిన అధికారుల పై చర్యలు తీసుకునేలా  ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా వారు కోరారు.

 

ప్లీనరీలు, సభల మీదే కాకుండా  ప్రజల సమస్యల పై కూడా దృష్టిపెట్టాలని వారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు డికె అరుణ, శారద  విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రులలోవైద్యం మెరుగుపరిచేందుకు, అధునాతనపరికరాలు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, సినీయర టిఆర్ ఎస్ నేతలే గులాబీ కూలి చేసి నిధులుసమకూరిస్తే ప్రజలు హర్షిస్తారని వారు అన్నారు. ఆసుపత్రులలో ఒక వైపు సరయిన వైద్యం అందక మరొక వైపు సిబ్బంది చేతి వాటం వల్ల ప్రజలు చాలాబాధపడుతున్నారని వారు అన్నారు.

 

గాంధీ భవన్ నుంచి హెచ్చార్సీ దాకా వారుప్రసూతి ఆసుపత్రుల్లో మరణాలు ప్రభుత్వ హత్యలే అనే బ్యానర్ తో  ర్యాలీగా వెళ్లారు. ర్యాలీ మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు.

click me!