ఉస్మానియా ‘మౌనం’ మీద పెదవి విప్పనున్న కెసిఆర్

First Published Apr 27, 2017, 6:21 AM IST
Highlights

ఉస్మానియా సెంటినరీ పంక్షన్ లో తాను మాట్లాడకపోవడాన్ని విమర్శస్తున్న  కాంగ్రెస్ కు  వరంగల్ నుంచి కెసిఆర్ ఘాటుగా సమాధానమిస్తారు

 

ఈ రోజు సాయంకాలం కెసిఆర్ తీవ్రస్థాయిలో ప్రతిపక్షాల మీద మండిపడతారని  విశ్వసనీయంగా తెలిసింది.

 

నిన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నూరేళ్ల సంబురంలో ఒక్క మాట కూడా కెసిఆర్ మాట్లాడకపోవడాన్ని ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా విమర్శించాయి.

 

‘తెలంగాణ పురిగడ్డ ఓయూ గురించి . విద్యార్థుల త్యాగాల గురించి మాట్లాడనందుకు కేసీఆర్ సిగ్గుపడాలి. .రాష్ట్ట్రపతి ముందే సీఎం మాట్లాడలేక పోయారంటే, విధ్యార్థులంటే ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది, అని కాంగ్రెస్ శాసన సభ్యడు జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడేళ్ల తర్వాత ఓయూలో అడుగు పెట్టిన కేసీఆర్ మూగ వాడిగా వెనుతిరిగాడు అని తీవ్రవమయిన వ్యాఖ్య చేశారు. 

 

ఈ సాయంకాలం వరంగల్ పట్టణంలో  తెలంగాణా రాష్ట్ర సమితి 16 వ వార్షికోత్సవ బహిరంగ సభలో, ‘ మా నాయకుడు దీనికి తగిన రీతిలో సమా ధానం చెబుతారు,’ అని వరంగల్ నుంచి ఒక సీనియర్ టిఆర్ ఎస్ పార్టీ నాయకుడు ఏసియానెట్ కు తెలిపారు.

 

వాస్తవమేమిటో తెలుసుకోకుండా కాంగ్రస్ నాయకులు మాట్లాడుతున్నారని, వారికి ఘాటైనసమాధానం  ఉంటుందని ఆయనచెపారు. దాదాపు పదిలక్షల మంది ముందుకెసిఆర్ కాంగ్రెస్ ను కడిగి పారేస్తారని  కూడా ఆయన చెప్పారు.

 

విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రభుత్వం ఏమి చేస్తున్నదో కూడా కెసిఆర్ వివరిస్తారని ఆయన తెలిపారు.

 

16వ టిఆర్ ఎస్ వార్షికోత్సవ సభకు వరంగల్  మినీతెలంగాణాగా ముస్తాబయింది. అన్ని జిల్లాల నుంచి వేలాది వరంగల్ కు తరలి వస్తున్నారు. సిఎం కెసిఆర్ వరంగల్ జిల్లాలో రెండు రోజుల పాటు బస చేస్తారు.

 

హైదరాబాద్ నుంచి గురువారం మధ్యాహ్నం 3.30 కు కెసిఆర్ హెలికాప్టర్‌లో బయలుదేరి 4.25కి వరంగల్ చేరుతారు. ఆర్ట్స్ కాలేజీ మైదానంలో దిగిన తరువాత కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి వెళతారు. సాయంత్రం 6.40 కి బహిరంగ సభ జరిగే స్థలానికి కెసిఆర్ చేరుకొని ప్రసంగిస్తారు. రాత్రిపూటి అక్కడే కెప్టెన్ ఇంటనే బస చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

click me!