‘నోటా’ సినిమాపై కాంగ్రెస్ నేతల షాకింగ్ కామెంట్స్

Published : Oct 02, 2018, 02:26 PM ISTUpdated : Oct 02, 2018, 02:37 PM IST
‘నోటా’ సినిమాపై కాంగ్రెస్ నేతల షాకింగ్ కామెంట్స్

సారాంశం

 ఈ సినిమాను విడుదలను ఆపాలంటూ మాజీ సెన్సార్ బోర్డు సభ్యులు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రజత్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.

సినీనటుడు విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘నోటా’. ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా.. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నోటా సినిమా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని ఆ పార్టీ నేతలు పొంగులేటి, గూడూరు నారాయణరెడ్డి అన్నారు. నోటా సినిమా ప్రేరణతో నోటా మీట నొక్కే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌, రాష్ట్ర ఎన్నికల కమిషన్, సెన్సార్ బోర్డ్ సభ్యులు నోటా సినిమాను పరిశీలించాలని, సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే తొలగించాలని పొంగులేటి, గూడూరు డిమాండ్ చేశారు. కాగా.. గత కొద్దిరోజులుగా ఈ సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 
 
ఇప్పటికే.. ఈ సినిమాను విడుదలను ఆపాలంటూ మాజీ సెన్సార్ బోర్డు సభ్యులు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రజత్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. నోటా చిత్రంలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలున్నాయని, విడుదలకు ముందే రాష్ట్ర ఎన్నికల అధికారులు, డీజీపీ ఈ సినిమా చూశాకే విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాకు టైటిలే ఒక వివాదంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

" ‘నోటా’ వల్ల ఎన్నికలు ప్రభావితం అవుతున్నాయి. ప్రజలు ‘నోటా’ బటన్‌ నొక్కుతారేమో? అనీ, ఈ సినిమా తెలంగాణలో ఒక పార్టీకి అనుకూలంగా వుందనీ, అందువల్ల విడుదలను నిలిపేయాలనీ కొంతమంది కేసులు పెట్టారు. వాళ్ళంతా ఎందుకు భయపడుతున్నారు? నన్ను అడిగితే.. నేను చెబుతా కదా! మేం ‘నోటా’ బటన్‌ నొక్కాలని చెప్పడం లేదు. ఒక పార్టీకి ఫేవర్‌గా ఏం చేయడం లేదు. ఒక్కటి మాత్రం నిజం... ఎన్నికలను ప్రభావితం చేసే పవర్‌ మన దగ్గర ఉంది. సినిమాలో యువ ముఖ్యమంత్రిని చూస్తారు" అని స్పష్టం చేశారు.

 

మరిన్ని వార్తలు

నోటాపై విమర్శలు.. విజయ్ దేవరకొండ సౌండ్ లేదేంటి?

సినిమా రిలీజ్ ఆపడానికి చాలా చేస్తున్నారు.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు!

'నోటా' టీఆర్ఎస్ కి సపోర్టా..?

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్