రాహుల్ గాంధీ సభకు అడ్డంకులు: ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ముందు వీహెచ్ ఆందోళన

By narsimha lode  |  First Published Jul 2, 2023, 2:21 PM IST

రాహుల్ గాంధీ సభకు  జన సమీకరణకు  తరలించే  వాహనాలను అడ్డుకోవడంపై  ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ముందు  ఆందోళనకు దిగారు.


ఖమ్మం: రాహుల్ గాంధీ  సభకు  జన సమీకరణకు తరలించే  వాహనాలను  అడ్డుకోవడంపై   ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్  ముందు  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు  ధర్నాకు దిగారు. 

సీఎల్పీ నేత  మల్లు భట్టి విక్రమార్క  నిర్వహించిన  పీపుల్స్ మార్చ్  పాదయాత్ర   ముగింపును పురస్కరించుకొని  ఇవాళ  ఖమ్మంలో  జనగర్జన పేరుతో  కాంగ్రెస్ పార్టీ  భారీ బహిరంగ  సభ నిర్వహిస్తుంది.  ఈ సభలోనే  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో  చేరుతున్నారు.  ఈ సభకు  భారీ ఎత్తున  జనాన్ని సమీకరిస్తుంది.   కాంగ్రెస్ పార్టీకి  జనాన్ని తరలిస్తున్న  వాహనాలపై   రూ. 10 వేలతో పాటు  లక్ష  రూపాయాల జరిమానా విధిస్తామని వాహన యజమానులను  ఆర్టీఏ అధికారులు  వార్నింగ్  ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు  ఆరోపిస్తున్నారు.

Latest Videos

undefined

  వాహనాలను పోలీసులు అడ్డుకోవడాన్ని  నిరసిస్తూ ఖమ్మం  రూరల్ పోలీస్ స్టేషన్  ముందు  వి. హనుమంతరావు  ఆందోళనకు దిగారు.   వాహనాల  రాకపోకలకు  అడ్డుగా  రోడ్డుపై  నిలిపిన బారికేడ్లను వి. హనుమంతరావు  తొలగించారు. రాహుల్ గాంధీ  సభను  అడ్డుకోవడానికి  బీఆర్ఎస్  అనేక ప్రయత్నాలు  చేస్తుందని  వి. హనుమంతరావు ఆరోపించారు.

ఖమ్మం సభకు వస్తున్న వాహనాలను  పోలీసులు అడ్డుకోవడంపై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం  చేశారు.ఈ విషయమై  తెలంగాణ డీజీపీ  అంజనీకుమార్ కు  ఫోన్  చేశారు.  వాహనాలను  పోలీసులు అడ్డుకోవడం  సరైంది కాదన్నారు.  పరిస్థితి చేయిదాటితే  అందుకు తాము బాధ్యత వహించలేమని రేవంత్ రెడ్డి డీజీపీకి  చెప్పారు. 

ఖమ్మం  సభకు  జనాన్ని తరలిస్తున్న  వాహనాలను  పోలీసులు, ఆర్టీఏ అధికారులు  అడ్డుకోవడంపై  కాంగ్రెస్ నేతలు  ఫైరయ్యారు.  ఎన్ని అడ్డంకులు సృష్టించినా  రాహుల్ గాంధీ  సభను  విజయవంతం  చేస్తామని  ఇవాళ కాంగ్రెస్ లో  చేరనున్న  మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ప్రకటించారు. 

also read:తెలంగాణ డీజీపీకి రేవంత్ రెడ్డి ఫోన్: ఖమ్మం సభకు రాకుండా వాహనాల నిలిపివేతపై ఆగ్రహం

హైద్రాబాద్ నుండి టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  ఖమ్మానికి బయలుదేరారు. హైద్రాబాద్ నుండి నేరుగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు రేవంత్ రెడ్డి  వెళ్లే  అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు  చెబుతున్నాయి. 


 


 


 

click me!