రైల్వే కోచ్, వ్యాగన్ ఫ్యాక్టరీకి తేడా లేదు: కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

By narsimha lode  |  First Published Jul 2, 2023, 1:38 PM IST


వరంగల్ లో  రైల్వే  వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీకి  ప్రధానమంత్రి ఈ నెల  8వ తేదీన  భూమిపూజ  చేస్తారని  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి  చెప్పారు.


వరంగల్: రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి, వ్యాగన్ ఫ్యాక్టరీకి పెద్దగా తేడా  లేదని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు. ఆదివారంనాడు  వరంగల్ లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే  బహిరంగ సభ స్థలాన్ని  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి , ఇతర బీజేపీ నేతలు  పరిశీలించారు.  రైల్వే అధికారులతో  ప్రధాన మంత్రి  రైల్వే వ్యాగన్ల తయారీ  ఫ్యాక్టరీకి శంకుస్థాపన  ఏర్పాట్ల గురించి  చర్చించారు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.  ఈ సందర్భంగా  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.   ఏ ఫ్యాక్టరీ  అయితేనేం  ఈ ప్రాంత ప్రజలకు  ఉపాధి కల్పించే  ఉద్దేశ్యంతో వ్యాగన్ల ఫ్యాక్టరీని  కేంద్రం ప్రారంభించనుందన్నారు.  

ఈ నెల  8వ తేదీన కాజీపేటలో  రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. మోడీకి  స్వాగతం పలికేందుకు  వరంగల్ ప్రజలు  ఎదురు చూస్తున్నారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు. కాజీపేటలో  నెలకు  200  వ్యాగన్లు  తయారు చేసే సామర్ధ్యంతో  ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు  చేయనున్నట్టుగా  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. వ్యాగన్ల ఫ్యాక్టరీతో  ఉపాధి అవకాశాలు పెరుగుతాయని  ఆయన  తెలిపారు. వ్యాగన్ల తయారీ ఫ్యాక్టరీతో పాటు  పలు జాతీయ రహదారులకు  కూడ ప్రధాని భూమి పూజ చేస్తారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  వివరించారు.  వరంగల్  కు చేరుకున్న తర్వాత  ప్రధాని మోడీ  తొలుత  భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.   ఆ తర్వాత  రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, రహదారుల భూమి పూజల్లో పాల్గొంటారని  కేంద్ర మంత్రి తెలిపారు. 

Latest Videos

undefined

 రాష్ట్రంలో  మౌలిక వసతుల  కల్పనకు  కేంద్రం పెద్ద పీట వేస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో  రీజినల్ రింగ్ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందని  కేంద్ర మంత్రి చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూమి  ఇస్తే అంత త్వరగా ఈ పనులు ప్రారంభం కానున్నాయని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 

కేంద్రం  సహకరిస్తున్నా  రాష్ట్ర ప్రభుత్వం  తమపై బురదచల్లుతుందని   కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.వరంగల్  కు  టెక్స్ టైల్స్  పార్క్ కు  కేంద్రం మంజూరు  చేసిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో  సైనిక్ స్కూల్ కు  కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం  చేసుకుందన్నారు.ఈ  ఒప్పందం మేరకు  రాష్ట్ర ప్రభుత్వానికి  లేఖలు రాస్తున్నా స్పందన లేదన్నారు.  బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని  ఏర్పాటు  చేస్తామని కేసీఆర్  హామీ ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు  చేశారు.  వెంటనే  బయ్యారంలో  స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు  చేయాలని  ఆయన డిమాండ్  చేశారు. 

click me!