Ranga Reddy: మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మంచి పట్టున్న కాంగ్రెస్ సీనియర్ నేతగా కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)కు మంచి గుర్తింపు ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న మంత్రి మల్లారెడ్డి, మరోమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిలకు చెక్ పెట్టేందేకు కాంగ్రెస్ కేఎల్ఆర్ ను రంగంలోకి దించినట్టు సమాచారం. ఇప్పటికే ఇక్కడి రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Congress leader Kichennagari Lakshma Reddy: తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అధికారం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ ముందువరుసలో ఉన్నట్టు ప్రస్తుత రాజకీయ సమీకరణాలు పేర్కొంటున్నాయి. దీనికి కారణం ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయంతో అధికార పీఠం దక్కించుకుంది. ఆదే జోష్ ను తెలంగాణలోనూ కొనసాగించాలని దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా రాజకీయాలకు సంబంధించి ఒక ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. పార్టీ సీనియర్ నేత కిచ్చెన్న గారి లక్ష్యారెడ్డి ఇంటికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు రావడం హాట్ టాపిక్ గా మారిందిత. ఈ ప్రాంతంలో రాజకీయాలపై ఈ సందర్భంగా చర్చించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ ప్రాంతంలో మంచి పట్టున్న నాయకుడిగా గుర్తింపు..
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మంచి పట్టున్న కాంగ్రెస్ సీనియర్ నేతగా కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)కి మంచి గుర్తింపు ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న మంత్రి మల్లారెడ్డి, మరోమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిలకు చెక్ పెట్టేందేకు కాంగ్రెస్ కేఎల్ఆర్ ను రంగంలోకి దించినట్టు సమాచారం. ఇప్పటికే ఇక్కడి రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్.. నేరుగా ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగి.. అన్ని విషయాలను పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రణాళికలకు అనుగుణంగా ఆ పార్టీ నాయకులను సిద్ధం
చేస్తూ.. జిల్లాలు..నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలను రంగంలోకి దించుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలకు సంబంధించి కేఎల్ఆర్ ను కాంగ్రెస్ రంగంలోకి దించింది.
ఆపరేషన్ రంగారెడ్డి..
కేఎల్ఆర్ కు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాధ్యతలు అప్పగించింది. ఈ ప్రాంతంలోని స్థానాల్లో గెలుపు దిశగా పార్టీని ముందుకు నడిపించే పనిని ఆయనకు అప్పగించింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రంగారెడ్డి ప్రాంతంలో పార్టీ అధికారంలోకి రావడానికి ఇక్కడి అసెంబ్లీ స్థానాల్లో గెలుపు కీలకం. గతంలో మేడ్చల్ ఎమ్మెల్యేగా పని చేసిన కేఎల్ఆర్ కాంగ్రెస్ నాయకత్వానికి విధేయుడిగా ఉన్నారు. ఆర్దిక, అంగ బలం కలిగిన కేఎల్ఆర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే కేఎల్ఆర్ ఇప్పటికే ఈ ప్రాంతంలో పర్యటనలను మొదలుపెట్టారు. క్షేత్రస్థాయి అంచనా రిపోర్టులతో రానున్న ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. చేవెళ్ల అసెంబ్లీ పరిధిలోని పార్టీ కీలక నేతలతో సమావేశమైన కేఎల్ఆర్ తనకు పార్టీ అప్పగించిన ఆపరేషన్ రంగారెడ్డి ప్రారంభించారు.
అభ్యర్థుల ఎంపికలో కీలకం..
ఆపరేషన్ రంగారెడ్డిలో భాగంగా కేఎల్ఆర్.. తన పర్యటనల క్రమంలో వ్యూహాలు సిద్ధం చేస్తూనే.. హైకమాండ్ కు ఇక్కడి విషయాలు నివేదించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో ఇప్పుడు కేఎల్ఆర్ నుంచి పార్టీ నివేదికలు కోరింది. అవి అభ్యర్ధుల ఖరారులో కీలకం అయ్యే అవకాశముంది. మొత్తానికి ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్.. తన ముందున్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలనీ, కీలక నేతల సేవలను గెలుపునకు ఉపయోగించుకునే విధంగా ముందుకు సాగుతోంది.