ప్రారంభమైన కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ: హుజూరాబాద్‌ ఓటమిపై చర్చ

By narsimha lodeFirst Published Nov 3, 2021, 11:34 AM IST
Highlights


హుజూరాబాద్ లో ఓటమిపై కాంగ్రెస్ పార్ట పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చర్చించనుంది.బుధవారం నాడు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమవేశం నిర్వహించారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం బుధవారం నాడు గాంధీ భవన్ లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ Revanth Reddy, పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి , చిన్నారెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు. అయితే హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత  రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం సమావేశానికి హాజరు కాలేదు.

also read:Huzurabad bypoll Result 2021... కాంగ్రెస్ లో 'చిచ్చు', రేవంత్‌పై సీనియర్ల ముప్పేట దాడి

వాస్తవానికి ఈ సమావేశంలో Congress  పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించాలని భావించారు. అయితే నిన్ననే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చాయి.దీంతో ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు కంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపైనే చర్చించనున్నారు.

Huzurabad bypoll కాంగ్రెస్ పార్టీకి కేవలం 3 వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీ 61 వేలకుపైగా ఓట్లను సాధించింది. అయితే ఈ ఉప ఎన్నికల్లో మూడు వేల ఓట్లను సాధించడం ఆ పార్టీ నాయకత్వాన్ని షాక్ కు గురి చేసింది.కనీసం 20వ వేల ఓట్లను రాబట్టుకొంటామని కొందరు నాయకులు అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఫలితం అందుకు భిన్నంగా రావడంతో వారంతా షాక్ కు గురయ్యారు. కనీసం 5 వేల ఓట్లు కూడా రాకపోవడంపై కాంగ్రెస్ నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఉప ఎన్నికను టీపీసీసీ నాయకత్వం అంత సీరియస్ గా తీసుకోలేదు. ఈఎన్నికను సీరియస్ గా తీసుకొంటే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఈ సమావేశానికి హుజూరాబాద్ లో పోటీ చేసిన బల్మూరి వెంకట్ ను కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఆహ్వానించారు. వెంకట్ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల్లో తనకు ఎదురైన అనుభవాలను వెంకట్ ఈ సమావేశంలో వివరించే అవకాశం ఉంది.

ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కావడంపై ఆత్మవిమర్శ అనివార్యమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం లేకపోలేదు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా రేవంత్ ను లక్ష్యంగా చేసుకొని సీనియర్లు విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో క్షేత్రస్థాయి కాంగ్రెస్ నాయకులు పరోక్షంగా బీజేపీకి సహకరించారని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.  దీంతో కాంగ్రెస్ పార్టీ తన ఓటింగ్ ను కూడా రాబట్టుకోలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయమై కూడా నేతలు చర్చించే అవకాశం లేకపోలేదు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకొనేందుుకు బీజేపీకి అవకాశం దక్కింది. అయితే ఈ పరిణామం రాజకీయంగా కాంగ్రెస్ కు నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదు. అయితే బీజేపీని కాంగ్రెస్ ఎలా ఎదుర్కోవాలనే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన జానారెడ్డి

ఈ సమావేశం నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి  వెళ్లిపోయారు.ఇతర కార్యక్రమాలున్నందున  తాను సమావేశం నుండి వెళ్లిపోతున్నానని జానారెడ్డి చెప్పారు.మరోవైపు ఈ సమావేశానికి రాలేదని అంటారని సమావేశానికి వచ్చినట్టుగా జానారెడ్డి తెలిపారు. మరోవైపు హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటమిపై స్పందించడానికి జానారెడ్డి నిరాకరించారు.


 


 

click me!