ఓటమి ఎఫెక్ట్: ఢిల్లీకి ఉత్తమ్, డీసీసీలకు కొత్త ముఖాలు

Published : Jan 03, 2019, 03:33 PM IST
ఓటమి ఎఫెక్ట్:  ఢిల్లీకి ఉత్తమ్, డీసీసీలకు కొత్త ముఖాలు

సారాంశం

తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్  పార్టీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియామాకాన్ని చేపట్టనుంది.


హైదరాబాద్: తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్  పార్టీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియామాకాన్ని చేపట్టనుంది.వచ్చే ఐదేళ్ల వరకు పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  సమర్థులైన వారికి  ఈ భాద్యతలను అప్పగించాలని భావిస్తోంది.

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఈ పరాజయం నుండి ా పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసే  దిశగా చర్యలు చేపట్టారు.  ఢీల్లీకి పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని  రావాలని  పార్టీ నాయకత్వం ఆదేశించింది.ఈ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్   గురువారం నాడు ఢిల్లీకి చేరుకొన్నారు.

పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంచార్జీలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జీ కుంతియా చర్చించనున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ  నేతలు చర్చించనున్నారు.

మూడు రోజుల పాటు వరుసగా ఈ  సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో  రానున్న రోజుల్లో  పార్టీని బలోపేతం చేసేందుకు  అవసరమైన కొత్త నాయకత్వాన్ని  జిల్లాల్లో తీసుకోనున్నారు.  డీసీసీ అధ్యక్షుల ఎన్నికల తర్వాత  పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే పీసీసీ ప్రక్షాళన పూర్తి చేయనున్నారు.

సంబంధిత వార్తలు

చెప్పినా ఉత్తమ్, రమణ వినలేదు: ఓటమిపై కోదండరామ్

ఉత్తమ్‌కు ఓటమి దెబ్బ: టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి: న్యాయ పోరాటానికి కాంగ్రెస్

తెలంగాణలో ఓటమిపై పార్టీ నేతలతో కుంతియా సమీక్ష

ఓటమిపై పోస్ట్‌మార్టమ్: ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు, ఇక ప్రక్షాళన

రంగంలోకి ఉత్తమ్: ఆ నలుగురిపై వేటుకు కాంగ్రెస్ డిమాండ్

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu