చిన్నారి ప్రాణాలను బలితీసుకున్న చికెన్ కర్రీ

Published : Jan 03, 2019, 01:57 PM IST
చిన్నారి ప్రాణాలను బలితీసుకున్న చికెన్ కర్రీ

సారాంశం

ఎంతో ఇష్టంగా వండుకుని తిన్న చికెన్ కర్రీ విషతుల్యమై ఓ కుటుంబం మొత్తం అస్వస్థతకు గురైన విషాద సంఘటన పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రంలో  చోటుచేసుకుంది. ఈ విషాహారం తిని ఏకంగా ఓ చిన్నారి బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇలా చికెన్ కర్రీ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది.   

మృతిచెందిన బాలుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కమాన్ పూర్ గ్రామానికి చెందిన కామెర శంకర్, పద్మ దంపతులకు రుషిక్ అనే మూడేళ్ళ కొడుకున్నాడు. తల్లిదండ్రులతో పాటు చిన్నారి కూడా చికెన్ ఇష్టంగా తినేవాడు. దీంతో బుధవారం ఈ కుటంబం చికెన్ వండుకుని తిన్నారు. ఇలా భోజనం చేసిన కాస్సేపటికే ఈ కుటుంబం మొత్తం అనారోగ్యానికి గురయ్యింది. దీంతో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. 

 తల్లిదండ్రలు ఆరోగ్యం మెరుగుపడ్డా రుషిక్ పరిస్థితి మాత్రం విషమంగా మారింది. దీంతో వారు పెద్దపల్లి ఆస్పత్రి నుండి బాలున్ని అర్థరాత్రి హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే కరీంనగర్ ఆస్పత్రికి చేరడానికి ముందే దారిలోనే చిన్నారి మృతి చెందాడు. 

చిన్నారి మృతితో తల్లిదండ్రులే కాదు గ్రామస్థులు కూడా విషాదంలో మునిగిపోయారు. వీరు తీసుకున్న ఆహారం విషతుల్యమవడం వల్లే చిన్నారి మృతిచెంది వుంటాడని తెలుస్తోంది.   
 
PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో మ‌రో కొత్త షాపింగ్ మాల్‌.. న‌గ‌రం న‌డిబొడ్డున దేశంలోనే తొలి ఏఐ మాల్‌, ఎక్క‌డో తెలుసా.?
Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి