లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections 2024) బీఆర్ఎస్ (BRS)తో బీజేపీ (BJP) పొత్తు పెట్టుకుంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Telangana BJP President Kishan reddy) స్పందించారు. కేంద్రంలో తమ పార్టీ మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అలెర్ట్ అయ్యాయి. దీంతో ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారం మొదలు పెట్టేశాయి. దేశంతో పాటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిస్తోంది. రాష్గ్రంలో 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
గృహిణిని తక్కువ అంచనా వేయొద్దు.. ఆమె సేవలను వెలకట్టలేం - సుప్రీంకోర్టు
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాలు కైవసం చేసుకోగా బీజేపీ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలుపొందగా.. ఎంఐఎం ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఈ లోక్ సభ ఎన్నికలపైనే ఫొకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో రకరకాల సమీకరణలు బయటకు వస్తున్నాయి. అందులో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో సర్క్యులేట్ అవతున్నాయి.
ఒకే ఎన్‌క్లోజర్‌లోకి అక్బర్, సీతా పేరున్న మగ, ఆడ సింహం.. కోర్టును ఆశ్రయించిన వీహెచ్ పీ
అయితే దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా స్పందించారు. తెలంగాణలో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో పొత్తుపై చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పట్టు కోల్పోయిందని అన్నారు. త్వరలో కాంగ్రెస్ కు కూడా అదే గతి పడుతుందని చెప్పారు.
అయోధ్య రాములోరికి తిరుమల వెంకన్న సాయం..
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోమని అన్నారు. వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దీమా వ్యక్తం చేశారు.