నాడు వ్యతిరేకించి నేడు మోడీతో జోడీ: కేసీఆర్‌పై రేవంత్ ఫైర్

Published : Feb 17, 2021, 12:37 PM IST
నాడు వ్యతిరేకించి నేడు మోడీతో జోడీ: కేసీఆర్‌పై రేవంత్ ఫైర్

సారాంశం

కేసీఆర్ అనుకొంటే వ్యవసాయ చట్టాలను అడ్డుకోవచ్చని  మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు. బుధవారం నాడు ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను రాష్ట్రాలకు అడ్డుకొనే హక్కుందన్నారు.

హైదరాబాద్: కేసీఆర్ అనుకొంటే వ్యవసాయ చట్టాలను అడ్డుకోవచ్చని  మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు. బుధవారం నాడు ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను రాష్ట్రాలకు అడ్డుకొనే హక్కుందన్నారు.

రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్ ఆ తర్వాత మాట మార్చి మోడీతో జోడీ కట్టాడని  రేవంత్ విమర్శించారు.కేంద్రం చట్టం చేసినా రాష్ట్రాలకు ఇష్టం లేకపోతే వాటిని అమలు చేయాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఈ చట్టంలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకొని ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మాణం చేయాలని ఆయన కేసీఆర్ ను డిమాండ్ చేశారు.

రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్ ఆ తర్వాత మాట మార్చి మోడీతో జోడీ కట్టాడని  రేవంత్ విమర్శించారు.
లాభసాటి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటు పరం చేస్తోందన్నారు. నవరత్నాలను కేంద్రం విక్రయించేందుకు కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు.

నూతన వ్యవసాయ చట్టాలను అమలు చేస్తే వ్యవసాయంపై బహుళజాతి కంపెనీల పెత్తనం పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
రైతులు ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆందోళనలు  చేస్తున్నా కూడ కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్