సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సుకు విద్యుత్‌షాక్: ముగ్గురికి గాయాలు

Published : Feb 17, 2021, 11:59 AM IST
సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సుకు విద్యుత్‌షాక్: ముగ్గురికి గాయాలు

సారాంశం

సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లిలో ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో బస్సులోని ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.  

 


సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లిలో ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో బస్సులోని ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి వద్ద ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లతో షాక్ తగిలింది. ఈ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణిస్తున్నారు. విద్యుత్ షాక్ తగలడంతో బస్సులోని ముగ్గురికి గాయాలయ్యాయి.  వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

బస్సుకు విద్యుత్ షాక్ తగలడంతో వెంటనే బస్సులోని ప్రయాణీకులను ఆసుపత్రికి తరలించారు.షాక్ కారణంగా గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడ ఇదే తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సలు విద్యుత్ షాక్ కు గురయ్యాయి.కొన్ని చోట్ల స్వల్ప ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. 

రహదారులకు అడ్డంగా విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయవద్దని కోరుతున్నారు. విద్యుత్ వైర్ల కారణంగా ఆర్టీసీ బస్సులకు తగిలి ప్రమాదానికి కారణమౌతున్నాయని పలువురు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో బుధవారం నాడు చోటు చేసుకొన్న ఘటనలో ముగ్గురు మాత్రమే గాయపడ్డారు. మిగిలినవారంతా క్షేమంగానే ఉన్నారని వైద్యులు ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్