రేవంత్ రెడ్డి పై పద్మారావు అభిమానం.. రేవంత్ నాకు బాగా దగ్గరోడంటూ ఆప్యాయత..

Published : Feb 17, 2021, 11:08 AM IST
రేవంత్ రెడ్డి పై పద్మారావు అభిమానం.. రేవంత్ నాకు బాగా దగ్గరోడంటూ ఆప్యాయత..

సారాంశం

రేవంత్ రెడ్డి తనకు బాగా దగ్గరోడు అంటూ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం జరిగిన ఈ ఘటనతో కార్యకర్తలు ఇవే మాటలు మననం చేసుకుంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇంతకీ విషయం ఏంటంటే.. మంగళవారం లాలాపేటలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదును పద్మారావు గౌడ్‌ ప్రారంభించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతుంటే.. అదే సమయంలో లాలాపేట మీదుగా తార్నాక వైపు రేవంత్ రెడ్డి వాహన శ్రేణి ర్యాలీ వెడుతోంది.

అది గమనించిన పద్మారావు గౌడ్‌ తన ప్రసంగాన్ని కాసేపు ఆపి అటువైపు చూశారు. రేవంత్‌ ఉన్నాడా ఆ ర్యాలీలో... ఆయన నాకు బాగా దగ్గరోడు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తరువాత సమావేశం ముగిసే వరకు కార్యకర్తలంతా పద్మారావు వ్యాఖ్యలపైనే చర్చించుకున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్‌, టీపీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రతిపక్షంలో ఉన్న ఓ నేత గురించి అధికారపార్టీ నేత ఇలా మాట్లాడడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచేసింది.  
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్