విజయారెడ్డి హత్య వెనుక టీఆర్ఎస్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumala  |  First Published Nov 5, 2019, 1:38 PM IST

విజయారెడ్డి మృతదేహాన్ని చూసేందుకు ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు రాకపోవడం బాధాకరమన్నారు. మొన్న ఆర్టీసీ, నిన్న రెవెన్యూ రేపు మరో శాఖకు ఇలాంటి చేదు అనుభవాలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. విజయారెడ్డి హత్య వెనుక టీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

విజయారెడ్డి హత్య స్కెచ్ వెనుక చాలా పెద్ద భూభాగోతమే ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. విజయారెడ్డికి నివాళులర్పించిన రేవంత్ రెడ్డి 500 ఎకరాల భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని ఆరోపించారు. 

Latest Videos

undefined

అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ప్రొద్బలం వల్లే విజయరెడ్డి పై దాడి జరిగిందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి విజయరెడ్డిపై ఉందని తమకు సమాచారం ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఇంతటి ఘోరమైన సంఘటన జరిగితే న్యాయం చేస్తామని ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దే ఉందన్న రేవంత్ రెడ్డి సంబంధిత అధికారి హత్యకు గురైనా కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. 

ఘటన జరిగిన 24 గంటలు కావస్తున్నా ఎలాంటి ప్రకటన చేయకపోడం బాధిస్తుందన్నారు. విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ చేయిస్తామని కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం విచారకరమన్నారు.  
 
రెవెన్యూ అధికారులను ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. అధికారులపై దాడులకు ఉసిగొల్పేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రెవెన్యూ అధికారులపై దాడి చేయాలని పిలుపు ఇవ్వడం వల్ల ఇలాంటి ఘటన జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భూవివాదం లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ప్రజలకు రెవెన్యూ శాఖకు మధ్య దూరం ప్రభుత్వమే పెంచిందని ఆరోపించారు ఎంపీ రేవంత్ రెడ్డి. విజయారెడ్డి మృతదేహాన్ని చూసేందుకు ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు రాకపోవడం బాధాకరమన్నారు. మొన్న ఆర్టీసీ, నిన్న రెవెన్యూ రేపు మరో శాఖకు ఇలాంటి చేదు అనుభవాలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులందరు సీరియస్ గా తీసుకొని ఐక్యమై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపు ఇచ్చారు. జ్యూడిషియల్ అధికారి విధినిర్వహణలో మరణిస్తే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని కానీ ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదని ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

tahsildar Vijaya Reddy: నిందితుడు సురేష్ పరిస్థితి ఆందోళనకరం

tahsildar vijaya reddy: తహిసిల్దార్ విజయా రెడ్డి కారు డ్రైవర్ మృతి

vijayareddy: తహసీల్దార్ విజయారెడ్డి హత్య....బయటపడుతున్న షాకింగ్ నిజాలు

click me!