కలెక్టర్‌గా మాయమై.. పురావస్తు శాఖలో ప్రత్యక్షమయ్యారు: ఆయనపై రేవంత్ అనుమానాలు

By Siva KodatiFirst Published Jul 18, 2020, 7:47 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు పురావస్తు శాఖలో ఉండటంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

రంగారెడ్డి కలెక్టర్‌గా ఉన్న రఘునందన్ రావు అక్కడ మాయమై.. వెంటనే ఆర్కియాలజీ శాఖలో తేలారని రేవంత్ అన్నారు. ఇరిగేషన్‌లో మురళీధర్ రావు ఎలా ఉన్నారో.. ఆర్కియాలజీ శాఖలో రఘునందన్ రావు ఉండటంపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

Also Read:10 నెలల్లోనే కొత్త సచివాలయం పూర్తిచేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశం

వెంటనే రఘునందన్‌ను పురావస్తు శాఖ నుంచి తొలగించాలని రేవంత్ డిమాండ్ చేశారు. సెక్రటేరియట్‌పై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఎండీసీతో సర్వే జరిగిందని.. సెక్రటేరియట్ పక్కనే వున్న కాంపౌండ్ ఆరో నిజాం కాలంలో నానాల ముద్రణ జరిగింది అని ప్రచారం ఉందన్నారు.

జీ బ్లాక్ నుంచి ఐదో నిజాం పరిపాలన చేశారని కొన్ని ఇంగ్లీష్ పత్రికలు కథనాలు రాశాయని.. అక్కడి నుంచి బయటకు సొరంగ మార్గాలు ఉన్నాయన్నారు. సెక్రటేరియట్ కింద చరిత్రాత్మక విషయాలు- ఆధారాలు ఉన్నాయని మర్రి చెన్నారెడ్డి హయాంలోనే అప్పటి కేంద్రాన్ని కోరారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

రాష్ట్రంలో పాత భవనాలు హెరిటేజ్‌‌లో ఏది పెట్టాలి.. ఏది పెట్టవచ్చు అనే విషయంపై ఆల్‌ పార్టీ ఆధ్వర్యంలో హెరిటేజ్ కమిటీ వేస్తామని కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని రేవంత్ చెప్పారు.

మూడేళ్ల కింద అసెంబ్లీ సాక్షిగా హెరిటేజ్ కమిటీ వేస్తా అన్న కేసీఆర్ మూడేళ్లు గడుస్తున్నా కమిటీ వేయలేదని రేవంత్ ఆరోపించారు. కూల్చుతున్న భవనాల కింద గుప్త నిధుల ఏమిలేకపోతే ఇంత సీక్రెట్‌గా కూల్చుతున్నారని ఆయన అన్నారు.

Also Read:ఇబ్బందికర పరిస్థితులు, నరదృష్టిని తొలగించడానికి కేసీఆర్ యాగం?

బీఆర్కే భవన్ ఉద్యోగులకు సైతం సెలవులు ఇచ్చి సెక్రటేరియల్ కూల్చాల్సిన అవసరం ఏం వుందో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. సచివాలయం చుట్టూ మూడు కిలోమీటర్ల చుట్టూ పోలీస్ బందోబస్తు పెట్టి కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

సచివాలయం కూల్చివేత పనులు వీడియో రికార్డ్ చేయడం లేదన్నారు. ఆర్కియాలజీ శాఖ ఎన్ఎండీసీ శాఖల ఆధ్వర్యంలో కూల్చడం లేదని రేవంత్ విమర్శించారు. ప్రభుత్వం వెంటనే హెరిటేజ్ కమిటీ అన్ని పార్టీల ఆధ్వర్యంలో వెయ్యాలన్నారు. సచివాలయం కూల్చివేత ప్రక్రియను ప్రచారం చేసేందుకు మీడియాను అనుమతించాలని ఆయన కోరారు. 

click me!