కేటీఆర్ ఫాం హౌస్‌పై డ్రోన్: ఎయిర్‌పోర్టులో రేవంత్ అరెస్ట్

Siva Kodati |  
Published : Mar 05, 2020, 04:53 PM ISTUpdated : Mar 05, 2020, 05:07 PM IST
కేటీఆర్ ఫాం హౌస్‌పై డ్రోన్: ఎయిర్‌పోర్టులో రేవంత్ అరెస్ట్

సారాంశం

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫాం హౌస్‌లో నిబంధనలనకు విరుద్ధంగా డ్రోన్‌ను వినియోగించిన కేసులో  నార్సింగి పోలీసులు రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.   

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫాం హౌస్‌లో నిబంధనలనకు విరుద్ధంగా డ్రోన్‌ను వినియోగించిన కేసులో  నార్సింగి పోలీసులు రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లి సమీపంలోని జన్వాడలో ఉన్న మంత్రి కేటీఆర్ ఫాంహౌస్‌లోని దృశ్యాలను రేవంత్ రెడ్డి అనుచరులు చిత్రీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ విధించడంతో ఆయనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

Also Read:రేవంత్‌కు షాక్: గోపన్‌పల్లి భూముల్లో అక్రమాలు నిజమే, ప్రభుత్వానికి ఆర్డీఓ నివేదిక

అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రవీణ్, విజయసింహ, జైపాల్ రెడ్డి, శివ, ఓంప్రకాశ్‌గా గుర్తించారు. అయితే రేవంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, వీరేశ్‌లపై విచారణ కొనసాగుతోంది. వీరిపై ఐపీసీ సెక్షన్ 184, 187 కేసు నమోదు చేశారు.

అరెస్ట్ చేసిన ఐదుగురిని రిమాండ్‌కు సైతం తరలించారు. ఈ కేసులో ఏ1, ఏ2గా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డిలను విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Also Read:రేవంత్‌పై మరో కేసు నమోదు, ఐదుగురి అరెస్ట్

అయితే వారిద్దరూ విచారణకు హాజరు కాలేదు. దీంతో గురువారం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రేవంత్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వెంటనే నార్సింగి పీఎస్‌కు తరలించారు.

Also Read:రేవంత్ రెడ్డి జిమ్మిక్కు: భూదందా ఆరోపణలపై చెప్తానని, మధ్యలో అదృశ్యమై...

కేటీఆర్ ఫాం హౌస్‌ ఉన్న ప్రాంతం నో ఫ్లైయింగ్ జోన్‌గా పోలీసులు ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే డ్రోన్ ఆపరేటర్ ఆ ప్రాంతంలో డ్రోన్ ఎగురవేసి, దృశ్యాలను చిత్రీకరించారని పోలీసులు చెబుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu
Brahmanandam Spech: వెంకయ్య నాయుడుపై బ్రహ్మానందం పంచ్ లు | Asianet News Telugu