కరోనా ఎఫెక్ట్: పడిపోయిన మెట్రో ప్రయాణాలు, రోజుకు 20 వేల తగ్గుదల

Siva Kodati |  
Published : Mar 05, 2020, 04:32 PM IST
కరోనా ఎఫెక్ట్: పడిపోయిన మెట్రో ప్రయాణాలు, రోజుకు 20 వేల తగ్గుదల

సారాంశం

హైదరాబాద్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై కరోనా ప్రభావం పడింది. దీని భయంతో బస్సులు, క్యాబ్‌లు, రైళ్లలో ప్రయాణం చేసేందుకు ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్ట్‌లో అతి ముఖ్యమైన మెట్రో రైల్.

రెండు రోజుల వ్యవధిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు భయటపడిన నేపథ్యంలో హైదరాబాద్ వాసులు వణికిపోతున్నారు. బుధవారం ఐటీ కారిడార్‌లోని మైండ్ స్పేస్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిలో కరోనా లక్షణాలు బయటపడటంతో భాగ్యనగరం ఉలిక్కిపడింది.

Also Read:కరోనా‌: అధికారుల తీరుపై హైకోర్టు అసంతృప్తి

దీంతో హైదరాబాద్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై కరోనా ప్రభావం పడింది. దీని భయంతో బస్సులు, క్యాబ్‌లు, రైళ్లలో ప్రయాణం చేసేందుకు ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్ట్‌లో అతి ముఖ్యమైన మెట్రో రైల్. సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఉన్న మెట్రోకు ఎండా కాలం కావడంతో ప్రయాణికులు పెరుగుతున్నారు.

సరిగ్గా ఇదే సమయంలో కరోనా జాడలు బయటపడటంతో మెట్రోకు ఎదురుదెబ్బ తగిలింది. రోజువారీ ప్రయాణికుల్లో 20 వేల మంది వరకు తగ్గారని హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. కరోనా వ్యాప్తి చెందకుండా హైదరాబాద్ మెట్రో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

Also Read:కరోనాతో ఐటీ కంపెనీల్లో వర్క్‌ఫ్రం హోం హడావిడి: ఈటల సంచలన వ్యాఖ్యలు

అన్ని మెట్రో రైళ్లను, మెట్రో స్టేషన్లను శుభ్రం చేయిస్తోంది. క్లినింగ్ సిబ్బంది, మెట్రో రైళ్లలోని ప్రతి అంగుళాన్ని స్పిరిట్, కెమికల్స్ చల్లుతూ శుభ్రం చేస్తున్నారు. కోచ్‌లో ఉండే సీట్లు, ప్రయాణీకులు సపోర్ట్ కోసం వుపయోగించే హ్యాండిల్స్‌కు కూడా మందులను పిచికారీ చేయిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?