టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సైతం ప్రభుత్వానికి విరాళం ప్రకటించారు. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1,500 పడకల కోవిడ్ 19 ఆసుపత్రికి రేవంత్ తన ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు అందజేశారు.
కరోనా వైరస్ భారతదేశంలో వెలుగు చూసిన నాటి నుంచి ప్రధాని నరేంద్రమోడీతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు తీసుకుంటున్న నిర్ణయాలకు పార్టీలకు అతీతంగా సహకరిస్తున్నారు. ఇదే సమయంలో పలువురు తమ ఎంపీ, ఎమ్మెల్యే నిధులును పీఎం కేర్స్, సీఎంఆర్ఎఫ్‌లకు అందజేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సైతం ప్రభుత్వానికి విరాళం ప్రకటించారు. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1,500 పడకల కోవిడ్ 19 ఆసుపత్రికి రేవంత్ తన ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు అందజేశారు.
undefined
Also Read;ఓవైసీ చెప్తే చేశారు: కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బుధవారం మల్కాజ్‌గిరి కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు లేఖను అందజేశారు. కాగా రాష్ట్రంలో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేక ఆసుపత్రిని నిర్మించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఆసుపత్రికి సివరేజ్ ప్లాంట్ నిర్మాణాన్ని మరిచారు. ఈ కారణంగా మురుగునీరంతా పక్కనే ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళుతోంది. దీంతో అక్కడి విద్యార్ధులు, వర్సిటీ సిబ్బంది ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
Also Read:కరోనా ఎఫెక్ట్: షెల్టర్ హోమ్స్‌లో సౌకర్యాలపై నివేదిక కోరిన తెలంగాణహైకోర్టు
ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం ముందుకొచ్చిన రేవంత్ రెడ్డి ఈ విరాళాన్ని ప్రకటించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, నందిగంటి శ్రీధర్ తదితరులు ఉన్నారు.