తండ్రీ కొడుకులిద్దరికి చెరో ఫాం హౌస్‌ కావాలా: జీవన్ రెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 6, 2020, 4:32 PM IST
Highlights

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. దీనిపై ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. 

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. దీనిపై ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఫామ్ హౌస్ కేటీఆర్ ది కాదు..కానీ ఆయన కొన్ని ఏండ్లుగా వాడుకుంటున్నారు అని బాల్కసుమన్ చెప్పారని, కేసీఆర్‌కి ఎర్రవల్లిలో, కేటీఆర్ కి జన్వాడ లో ఫామ్ హౌస్ ఎందుకని జీవన్ రెడ్డి నిలదీశారు.

శుక్రవారం శాసనమండలి సమావేశానికి హాజరైన ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. 111 జివో నిబంధనలకు విరుద్ధంగా 25 ఎకరాల్లో కేటీఆర్ ఫాం హౌస్ నిర్మాణాన్ని చేపట్టారని జీవన్ రెడ్డి ఆరోపించారు.

Also Read:కేసీఆర్ ఫామ్ హౌస్ ను కూల్చే దమ్ము లేదు: రేవంత్ అరెస్టుపై భగ్గుమన్న కోమటిరెడ్డి

కేటీఆర్ తన విలాసవంతమైన జీవనం కోసం 111 జీవోను ఉల్లంఘించారని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఉల్లంఘనలను బయటపెట్టినందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు.

అసలు దొంగలను పట్టుకోవడం మానేసి ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తారా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.  111 జివోను కాపాడాల్సిన కేటీఆర్ స్వయంగా ఆయనే ఉల్లంఘిస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు.

25 ఎకరాల్లో కేటీఆర్ కి ఫామ్ హౌస్ ఎందుకని ప్రశ్నించిన ఆయన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కోర్టు గైడ్ లైన్ ఉన్నా రేవంత్ అరెస్ట్ న్యాయబద్ధమైనది కాదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. 111 జివో తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతుందా లేదా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Also Read:రేవంత్ రెడ్డి అరెస్ట్ కక్షసాధింపు చర్యే: కుంతియా

అక్రమ నిర్మాణం కి పాల్పడ్డ వారికి కాపలా ఉన్న కేటీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని జీవన్ నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో 111జివో అమలు వెంటనే చేయాలని, కేటీఆర్ పై 111జివో ఉల్లంఘన పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

click me!