కేసీఆర్ ఫామ్ హౌస్ ను కూల్చే దమ్ము లేదు: రేవంత్ అరెస్టుపై భగ్గుమన్న కోమటిరెడ్డి

By telugu teamFirst Published Mar 6, 2020, 4:26 PM IST
Highlights

తమ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెసు ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి తప్పు పట్టారు. స్పీకర్ అనుమతి లేకుండా ఎంపీని ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంపై తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి అరెస్టును ఆయన ఖండించారు. 

స్పీకర్ అనుమతితోనే ఓ ఎంపీని అరెస్టు చేయాల్సి ఉంటుందని, అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి అరెస్టుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 

Also Read: రేవంత్ రెడ్డి అరెస్ట్ కక్షసాధింపు చర్యే: కుంతియా

111 జీవో పరిధిలో నిర్మాణాలకు అనుమతి లేదని, మరి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ను ఎలా కట్టారని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఓ న్యాయం, పేదలకు మరో న్యాయమా అని అడిగారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ను కూల్చే దమ్ములు అధికారులకు లేవని ఆయన అన్నారు. 

కేటీఆర్ ఫామ్ ఫాం హౌస్ పై ట్రిబ్యునల్ కు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. కోకాపేట భూములు కేటీఆర్ మనుషుల చేతుల్లో ఉన్నది వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. గోపన్ పల్లి, కోకాపేట భూములపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గోపన్ పల్లి భూముల విషయంలో రేవంత్ రెడ్డి తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకోవచ్చునని ఆయన అన్నారు.

Also Read: చంచల్‌గూడ జైలుకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డిని కక్షతోనే జైల్లో పెట్టారని కాంగ్రెసు నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి అసలు డ్రోన్ లే వాడలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి డ్రోన్ లు వాడినట్లు ఆధారాలున్నాయా ఆయన పోలీసులను ప్రశ్నించారు. 111 జీవోకు విరుద్ధంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టారని, ఆ విషయాన్ని వేలెత్తి చూపారనే అక్కుసతోనే రెడ్డిని అరెస్టు చేశారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 

రంగారెడ్డి జిల్లావాళ్లు చిన్న గుడిసె వేసినా కూల్చివేస్తున్నారని ఆయన అడిగారు. రంగారెడ్డి జిల్లావాళ్లకు ఓ న్యాయం, కరీంనగర్ వాళ్లకు మరో న్యాయమా అని అడిగారు. రేవంత్ రెడ్డిపై కోపం ఉంటే కోర్టులో తేల్చుకోవాలని ఆయన అన్నారు. 

click me!