ఆ నలుగురు టిఆర్ఎస్ నేతలే 400 ఎకరాలు నొక్కేశారు

First Published Aug 29, 2017, 3:39 PM IST
Highlights
  • ఆ నలుగురు నేతలు 400 ఎకరాలు కబ్జా చేశారు
  • వాళ్ళు పార్టీ కీలక నేతల చుట్టే తిరుగుతారు
  • వక్ఫ్ భూమి కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు

అధికార టిఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ఫైర్ అయ్యారు. మైనారిటీలకి ఎన్నో చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం అమలులో మాత్రం చేసిందేమీ లేదన్నారు.

క్షేత్రస్థాయిలో మైనారిటీలకి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడంలేదని ఆరోపించారు. గత 3 సంవత్సరాలుగా మైనార్టీలకు ఫీజు రియంబర్స్ మెంట్ అందడంలేదన్నారు.

తెరాస కీలక నేతల చుట్టూ తిరిగే ఆ నలుగురు నాయకులు మల్కాజిగిరిలో వక్ఫ్ కి సంబంధించిన 400 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. ఆ భూమిలో ప్రస్తుతం ఆ నలుగురు నేతలు దర్జాగా రియల్ ఎస్టేట్ చేస్తున్నారని తెలిపారు. ఆ భూముల స్వాధీనం పై వక్ఫ్ బోర్డ్ స్పందించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అనేక చోట్ల భూములు అన్యాక్రాంతం అవుతుంటే ప్రభుత్వం సరిగా స్పందిచడం లేదని సంపత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయమాటలతో క్రిస్టియన్, ముస్లిం ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఎద్దేవా చేశారు. 

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

click me!