మా వద్ద హోంశాఖ లేదు అందుకే బీజేపీలోకి: ఈటలపై జగ్గారెడ్డి కామెంట్స్

By narsimha lodeFirst Published Jun 2, 2021, 3:10 PM IST
Highlights

తమ  దగ్గర హోం శాఖ లేదు....అందుకే ఈటల రాజేందర్ కాంగ్రెస్ కాకుండా బీజేపీ వైపు చూస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు.
 

హైదరాబాద్: తమ  దగ్గర హోం శాఖ లేదు....అందుకే ఈటల రాజేందర్ కాంగ్రెస్ కాకుండా బీజేపీ వైపు చూస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు.బుధవారం నాడు ఆయన  హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారను. ఢిల్లీలో హోం శాఖ, ఇన్‌కమ్ ట్యాక్స్ , ఈడీలు అవసరమని  ఈటలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

also read:బీజేపీలోకి ఈటల రాజేందర్: హుజూరాబాద్‌పై టీఆర్ఎస్ ఫోకస్

ఈటలపై తెలంగాణ పోలీసులు కేసు పెట్టారు. కానీ ఆయనకు ఢిల్లీ పోలీసుల అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ బలమైందన్నారు. ఈటెల బలహీనుడని ఆయన అభిప్రాయపడ్డారు. పోరాటం చేయాలని అనుకుంటే కాంగ్రెస్ దగ్గరికి ఈటల వచ్చేవాడు.  బలహీనుడైనందునే ఆయన బీజేపీని ఎంచుకొన్నాడని ఈటలపై జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.

also read:అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, నేను రేసులో ఉన్నా: జగ్గారెడ్డి

తాను  పీసీసీ చీఫ్  అయితే రాష్ట్రంలో అంబులెన్స్ లు ఏర్పాటు చేసే వాడినని చెప్పారు. అధిష్టానం పిసిసి చీప్  గా ఎవరి పేరు నిర్ణయం చేసిన  పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తనకు  ఇష్టం ఉన్న వ్యక్తి పిసిసి చీఫ్  అయితే రాష్ట్రం అంతా తిరుగుతానని చెప్పారు.లేదంటే నియోజకవర్గానికి పరిమితంకానున్నట్టుగా ఆయన తెలిపారు.
 

click me!