రామలింగారెడ్డి భార్యకు టిక్కెట్టిస్తే ఏకగ్రీవం కోసం ప్రయత్నిస్తా: జగ్గారెడ్డి

By narsimha lodeFirst Published Aug 6, 2020, 6:24 PM IST
Highlights

దుబ్బాక ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి భార్యకు టిక్కెట్టు ఇవ్వడమే ఆయనకు నిజమైన నివాళి అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అని అభిప్రాయపడ్డారు.
 

హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి భార్యకు టిక్కెట్టు ఇవ్వడమే ఆయనకు నిజమైన నివాళి అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అని అభిప్రాయపడ్డారు.

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి: కేసీఆర్ నివాళులు

గురువారం నాడు ఆయన హైద్రాబాద్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.  బుధవారం నాడు రాత్రి అనారోగ్యంతో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి హైద్రాబాద్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

also read:మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై జగ్గారెడ్డి మరోసారి సంచలనం: టీజీవో నేతల సంగతి బయటపెడతా

దీంతో ఈ విషయమై ఆయన స్పందించారు. రామలింగారెడ్డి భార్యకు టీఆర్ఎస్ టిక్కెట్టు ఇస్తే తమ పార్టీ నేతలతో మాట్లాడితే ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు.

ఈ విషయమై పీసీసీ చీఫ్ ఉత్తమ్ తో మాట్లాడుతానని చెప్పారు. తమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ్మ, మాజీ మంత్రి గీతారెడ్డిలను కలిసి ఒప్పించనున్నట్టుగా ఆయన తెలిపారు. హరీష్ రావుతో సమన్వయం చేసుకొని తనను ఆయనతో కూర్చోబెట్టింది రామలింగారెడ్డేనని ఆయన గుర్తు చేసుకొన్నారు.

రామలింగారెడ్డి మృతితో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల గురించి జగ్గారెడ్డి ఇవాళ వ్యాఖ్యలు చేశారు.  జగ్గారెడ్డి తమ పార్టీకి చెందిన నేతలను కూడ ఒప్పిస్తానని ప్రకటించారు. అయితే గతంలో పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసింది. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీకి దింపింది. రామ లింగారెడ్డి మరణంతో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిని పెడుతోందా... పెట్టదా అనేది భవిష్యత్తులో తేలనుంది. 

click me!