మల్టీ లెవల్ మార్కెటింగ్: యువతులపై లైంగిక వేధింపులు, నలుగురి అరెస్ట్

By narsimha lodeFirst Published 6, Aug 2020, 3:39 PM
Highlights

మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నలుగురిని హైద్రాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్:మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నలుగురిని హైద్రాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు.
ఉద్యోగం కోసం వెతుకుతున్న యువతులు, లేదా డబ్బులు సంపాదించాలనే ఆాశతో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని ఈ ముఠా మోసాలకు పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు.

మల్టీ లెవల్ మార్కెటింగ్ సేరుతో యువతులను టార్గెట్ చేసుకొని ఈ ముఠా తమ సంస్థలో చేర్పించినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ముఠా దారుణాలపై ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుపై  పోలీసులు ఈ నలుగురిని అరెస్ట్ చేస్తే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

తమ మాదిరిగానే  ఈ వ్యాపారంలో చేరాలని యువతులను ప్రోత్సహించేవారు ... తమ మాదిరిగానే ఇతరులను కూడ సంస్థలో చేర్పించాలని ఒత్తిడి తెచ్చేవారు. ఒకవేళ మధ్యలో వదిలేసి తమ డబ్బులు ఇవ్వాలని కోరేవారిని తీవ్రంగా వేధింపులకు గురి చేసేవారని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు డబ్బులు అడిగినందుకు గాను లైంగికంగా వేధించేవారని కూడ ఆమె పోలీసులకు తెలిపింది.ఈ రకంగా వేధింపులకు పాల్పడే వారి గురించి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. 
 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 6, Aug 2020, 3:39 PM