సుప్రీం ఆదేశాల మేరకే డిగ్రీ, పీజీ పరీక్షలు: తెలంగాణ ఉన్నత విద్యామండలి

By narsimha lodeFirst Published Aug 6, 2020, 5:21 PM IST
Highlights

ఆన్ లైన్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు  పాఠాలు బోధించాలని భావిస్తున్నామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ పాపిరెడ్డి చెప్పారు.
గురువారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 

హైదరాబాద్: ఆన్ లైన్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు  పాఠాలు బోధించాలని భావిస్తున్నామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ పాపిరెడ్డి చెప్పారు.
గురువారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.  విద్యాబోధన కోసం ఒకటి రెండు ఛానెల్స్ ను అద్దెకు తీసుకోవాలని యోచిస్తున్నామన్నారు. 

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షలపై నిర్ణయం తీసుకొంటామని ఆయన ప్రకటించారు.కాంపిటిటీవ్ ప్రవేశ పరీక్షలను నిర్వహించకపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో పిల్ ఉన్నందున ఈ పరీక్షలు ఇప్పటికిప్పుడే నిర్వహించలేమన్నారు. హైకోర్టులో ఈ కేసు క్లియర్ అయితే ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

విద్యా సంవత్సరం పాలసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని సూచనలు చేశారని  ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఆన్ లైన్ క్లాసులపై విచారణ సందర్భంగా రెండు మూడు రోజుల్లో విద్యా సంవత్సరంపై ప్రకటన చేయనున్నట్టుగా హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 

click me!