MLA Vivek: ఈడీ విచారణకు ఎమ్మెల్యే వివేక్.. విచారణ అనంతరం ఏం చెప్పారంటే?

By Mahesh KFirst Published Jan 18, 2024, 6:30 PM IST
Highlights

కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ గురువారం ఈడీ విచారణకు హాజరయ్యారు. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ లావాదేవీల వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్నది.
 

ED Probe: చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట (ఈడీ) ముందు హాజరయ్యారు. ఈడీ విచారణకు ఆయన గురువారం హాజరయ్యారు. విశాఖ ఇండస్ట్రీ, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ లావాదేవీల వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈడీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ను విచారించింది.

విశాఖ ఇండస్ట్రీస్ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలోకి రూ. 8 కోట్లకు పైగా నిధుల లావాదేవీలపై తెలంగాణ పోలీసుల గతంలోనే కేసు ఫైల్ చేశారు. ఇందుకు సంబంధించి అధికారులు సుదీర్ఘమైన దర్యాప్తు చేశారు. వీటితోపాటు డిపాజిట్లకు సంబంధించిన వ్యవహారంపై ఈడీ ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వివేక్‌ను విచారించింది.

Latest Videos

Also Read: Ayodhya: అయోధ్యకు వందకుపైగా విమానాలు.. యూపీలోని ఐదు ఎయిర్‌పోర్టుల్లో వీఐపీల విమానాల పార్కింగ్

విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మధ్య జరిగిన సుమారు రూ. 100 కోట్ల లావాదేవీల వ్యవహారంపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. దీనిపై ఇవాళ వివేక్‌ను ప్రశ్నించింది. 

గురువారం సుమారు నాలుగు గంటలపాటు వివేక్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ తర్వాత చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ మీడియాతో మాట్లాడారు.  ఫెమా నిబంధనలు తాను ఉల్లంఘించలేదని మరోసారి స్పష్టం చేసినట్టు చెప్పారు. తాను బీజేపీ నుంచి బయటికి వచ్చిన తర్వాతే తనపై ఈడీ సోదాలు జరిగాయని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే వ్యక్తిగత కక్షతో సోదాలు చేయించాయని ఆరోపించారు. మరోసారి ఈడీ ముందు హాజరు కావాల్సిన అవసరం లేదని ఈడీ అధికారులు చెప్పినట్టు వివరించారు. అయితే, ఏవైనా అవసరమైన పత్రాలు ఉంటే మాత్రం సమర్పించడానికి సిద్ధంగా ఉండాలని సూచనలు చేసినట్టు పేర్కొన్నారు.

click me!