కాంగ్రెస్ అంటే స్కామ్‌లు.. బీఆర్‌ఎస్ అంటే సంక్షేమ‌ పథకాలు : మ‌ల్లారెడ్డి

By Mahesh Rajamoni  |  First Published Oct 20, 2023, 5:01 AM IST

Hyderabad: దేశంలోనే మేడ్చల్‌ లాంటి నియోజకవర్గం ఎక్కడా లేదని బీఆర్ఎస్ లీడ‌ర్ మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు, పలు గ్రామ పంచాయతీలు, ఇతరత్రా 400 మందికి పైగా ప్రజాప్రతినిధులు ఉన్నారు. నియోజకవర్గంలోని ఈ యూఎల్‌బీలకు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరిన‌ట్టు తెలిపారు.
 


BRS leader Ch Malla Reddy: కాంగ్రెస్ అంటే అన్నీ కుంభకోణాలు అయితే, బీఆర్‌ఎస్ అంటే అన్నీ సంక్షేమ‌ పథకాలేనని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేత సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి కే.చంద్రశేఖ‌ర్ రావు (కేసీఆర్) నాయ‌క‌త్వంలోని భారత రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ప్ర‌భుత్వం రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌ని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరం తోడ్పాటు అందించి సంక్షేమ, అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకువెళ్లిందన్నారు. ముఖ్యమంత్రిని పొగుడుతూ వచ్చిన మల్లా రెడ్డి.. వచ్చేది కారు... ఏలేది సారూ... అతనే కేసీఆర్ అని అన్నారు.

దేశంలోనే మేడ్చల్‌ లాంటి నియోజకవర్గం ఎక్కడా లేదని బీఆర్ఎస్ లీడ‌ర్ మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు, పలు గ్రామ పంచాయతీలు, ఇతరత్రా 400 మందికి పైగా ప్రజాప్రతినిధులు ఉన్నారు. నియోజకవర్గంలోని ఈ యూఎల్‌బీలకు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరిన‌ట్టు తెలిపారు. బీఆర్‌ఎస్‌ నాయకుడు మాట్లాడుతూ ప్రభుత్వం జీఓ 58, 59 కింద పేదలకు 40 వేల ఇళ్ల పట్టాలు, 26 వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేయవచ్చని తెలిపారు. నియోజకవర్గానికి గురుకుల పాఠశాలను కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. 1100 లంబాడ కుటుంబాలకు ఇళ్ల పట్టాలు, శామీర్‌పేట చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాడం వంటి అంశాల‌ను ప్ర‌స్తావించారు. కాంగ్రెస్ పార్టీని సింగిల్ డిజిట్‌కే పరిమితం చేసి మూడోసారి ముఖ్యమంత్రిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Latest Videos

కాగా, నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫ‌లితాలు వెల్ల‌డిస్తామ‌ని భార‌త ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుంద‌ని భావిస్తున్నారు. అయితే, 2018లో జరిగిన మునుపటి అసెంబ్లీ ఎన్నికలలో, BRS 119 స్థానాలకు గాను 88 స్థానాలను గెలుచుకోగలిగింది. 47.4 శాతం ఓట్ల వాటాను కలిగి ఉంది. కాంగ్రెస్ 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. దాని ఓట్ షేర్ 28.7 శాతంగా ఉంది.

click me!