బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడించ‌డం ప‌క్కా.. డ్రామారావు.. : కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి కౌంటర్

Google News Follow Us

సారాంశం

TPCC chief Revanth Reddy: "తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్ష భాగస్వాములు. జెండాలను ఎజెండాలను పక్కనబెట్టి అంతా ఏకమైతే తెలంగాణ సాకారమైందని" తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అయితే, "మీ త్యాగాన్ని బీఆరెస్ ప్రభుత్వం మరిచిపోయింది. సకలజనుల సమ్మెలో మీరు భాగస్వాములు కాకపోతే.. తెలంగాణ సాకరమయ్యేదా? కార్మికుల వైపు ఉన్నామనేది వాళ్లే, ప్రభుత్వంలో ఉన్నది వాళ్లే , సమస్యలు పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నది వాళ్లే" అంటూ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు.
 

Telangana Assembly Elections 2023: కాంగ్రెస్‌ బస్సుయాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్పందిస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కేటీఆర్‌ డ్రామా రావ్‌ అని చెప్పడాన్ని ప్రస్తావిస్తూ కేవలం ఎదురుదాడికి దిగుతున్నారనీ, ఈ క్ర‌మంలోనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నార‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గిరిజన యూనివర్శిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ ప్రాజెక్టులను ప్రకటించినది కాంగ్రెస్‌ పార్టీయేననీ, ఈ ప్రాజెక్టులను కేసీఆర్‌ అమలు చేయలేకపోయారని, హామీలన్నీ నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్‌ కూడా చేయలేదని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కయి మూడు ప్రాజెక్టులను ఆపారని రేవంత్‌ రెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రకటించిన ప్రాజెక్టుల కోసం పోరాడలేని కేసీఆర్ పాలనను ప్రజలు అంతం చేయాలని నిర్ణయించారని టీపీసీసీ అధ్యక్షుడు అన్నారు. అంతకుముందు భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశమై కార్మికుల సమస్యలను ప్రస్తావించారు. పాలక బిఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మికుల త్యాగాలను విస్మరించిందని, వారి సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

"తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్ష భాగస్వాములు. జెండాలను ఎజెండాలను పక్కనబెట్టి అంతా ఏకమైతే తెలంగాణ సాకారమైందని" తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అయితే, "మీ త్యాగాన్ని బీఆరెస్ ప్రభుత్వం మరిచిపోయింది. సకలజనుల సమ్మెలో మీరు భాగస్వాములు కాకపోతే.. తెలంగాణ సాకరమయ్యేదా? కార్మికుల వైపు ఉన్నామనేది వాళ్లే, ప్రభుత్వంలో ఉన్నది వాళ్లే , సమస్యలు పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నది వాళ్లే" అంటూ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

అలాగే, "నిస్సిగ్గు మాటలు.. ఎదురుదాడులు కేరాఫ్ అడ్రస్ డ్రామారావు. 10 ఏళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోడీ - కేడీ. కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది మోడీ - కేడీ. కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది మోడీ - కేడీ. విభజన చట్టంలోని హామీలను అమలు చేయించలేని దద్దమ్మలం అని నీవే ఒప్పుకుంటున్నావు. తెలంగాణకు ఈ దద్దమ్మ పాలన ఇక అవసరం లేదు" అంటూ విమ‌ర్శించారు.

Read more Articles on