ఓఆర్ఆర్ లీజు‌పై సీబీఐ విచారణకు సిద్దం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Published : May 10, 2023, 05:12 PM IST
ఓఆర్ఆర్  లీజు‌పై సీబీఐ విచారణకు సిద్దం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి

సారాంశం

ఔటర్ రింగ్  రోడ్డు టెండర్ల  కేటాయింపులో  సీబీఐ విచారణకు  తాము సిద్దంగా  ఉన్నామని  బీఆర్ఎస్ ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి  చెప్పారు. 

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల  కేటాయింపు  విషయంలో సీబీఐ  విచారకు  తాను సిద్దంగా  ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి  చెప్పారు. బుధవారంనాడు హైద్రాబాద్ బీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో  ఆయన మీడియాతో మాట్లాడారు.  ఔటర్ రింగ్  రోడ్డు టెండ్ల విషయంలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  అవగాహన లేక మాట్లాడుతన్నారన్నారు.  నిబంధనల మేరకు  ఔటర్ రింగ్ రోడ్డు  టెండర్ల  కేటాయింపు  జరిగిందన్నారు.  సీబీఐ బీజేపీ  జేబు సంస్థగా  సుధీర్ రెడ్డి ఆరోపించారు. తమ జేబు సంస్థతో  విచారణ  చేయించాలని  ఆయన  కోరారు.  సీబీఐ విచారణకు  కిషన్ రెడ్డి  సిద్దమా  అని ఆయన  ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇష్టారీతిలో మాట్లాడడం సరైంది కాదన్నారు. 

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ చావు దెబ్బతినబబోతుందని   కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే  కేపి వివేకానంద  గౌడ్  జోస్యం  చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ లో  కొత్త అంశం  ఏమీ లేదన్నారు.  త్వరలో తెలంగాణలో జరిగే  ఎన్నికల్లో  బీఆర్ఎస్ మరోసారి  అధికారంలోకి వస్తుందని  ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 

ఔటర్ రింగ్ రోడ్డు లీజుపై  విపక్షాల వాదనలు ఇవీ..

ఔటర్ రింగ్  రోడ్డును  30 ఏళ్ల పాటు  ప్రైవేట్  సంస్థకు  లీజు కేటాయించడంపై   కాంగ్రెస్, బీజే.పీలు  అనుమానాలు వ్యక్తం  చేస్తున్నాయి.  నిబంధనలకు విరుద్దంగా  ఈ టెండర్ కేటాయింపు జరిగిందని  విపక్షాలు ఆరోపిస్తున్నాయి.  కేవలం  రూ. 7వేల కోట్లకే ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ సంస్థకు కేటాయించడంపై  విపక్షాలు మండిపడుతున్నాయి.

టెండర్ పూర్తైన  16 రోజుల తర్వాత  టెండర్ విషయాన్ని  అధికారులు ప్రకటించడం వెనుక మతలబు జరిగిందని  బీజేపీ  ఆరోపణలు చేసింది. ఎన్‌హెచ్ఏఐ  నిబంధనలను పాటించలేదని ఆ పార్టీ విమర్శించింది.ఔటర్ రింగ్  రోడ్డు   లీజు విషయమై ఆర్‌టీఐ కింద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  సమాచారం అడిగారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం