టెర్రరిస్టులకు హైద్రాబాద్ పాతబస్తీ అడ్డా: కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

By narsimha lode  |  First Published May 10, 2023, 5:46 PM IST

హైద్రాబాద్ పాతబస్తీ  ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని  బండి సంజయ్ ఆరోపించారు. 
 


హైద్రాబాద్:పాకిస్తాన్ తర్వాత  హైద్రాబాద్ పాతబస్తీ  ఉగ్రవాదులకు  అడ్డాగా మారిందని   బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.  

బుధవారంనాడు హైద్రాబాద్ బీజేపీ  కార్యాలయంలో  ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు  బండి సంజయ్  మీడియాతో మాట్లాడారు.   హైద్రాబాద్  లో ఆరుగురు ఉగ్రవాదులు అరెస్ట్ కావడంతో  ఉగ్రవాదులకు  ఈ ప్రాంతంఅడ్డాగా మారిందని  ఆయన ఆరోపించారు. పట్టుబడిన  ఉగ్రనేత ఓవైసీ  ఆసుపత్రిలో  పనిచేస్తున్నారని  బండి సంజయ్  చెప్పారు. ఉగ్రవాదులకు, రోహింగ్యాలకు  ఎంఐఎం ఆశ్రయం కల్పిస్తుందని  ఆయన  విమర్శించారు. 

Latest Videos

undefined

ఇతర రాష్ట్రాల్లో నేరాలు  చేసి  హైద్రాబాద్ పాతబస్తీలో తలదాచుకుంటున్నారని  బండి సంజయ్  ఆరోపించారు. గతంలో  కాంగ్రెస్ పార్టీ  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో  కూడా ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా  వ్యవహరించారన్నారు.  మన  ప్రాణాలను మనమే కాపాడుకోవాల్సిన  పరిస్థితులు నెలకొన్నాయని  ఆయన చెప్పారు. 

తెలంగాణ పోలీసులు హీరోలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  సహకరించకోపవడంతో  పోలీసులు కూడా ఏం చేయలేకపోయారన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే కేంద్రం ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు.  టెర్రరిస్టుల విషయంలో  బీఆర్ఎస్ సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తుందని  బండి సంజయ్ విమర్శించారు.   కేసీఆర్ హింసించే పులకేశి  అంటూ  ఆయన సెటైర్లు వేశారు. 

also read:ఉగ్రమూలాలపై ఏటీఎస్ సోదాలు: హైద్రాబాద్ లో మరొకరు అరెస్ట్

మాజీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సోమేష్ కుమార్ ను  ప్రభుత్వ సలహాదారుగా  తీసుకోవడంపై  బండి సంజయ్ మండిపడ్డారు.  అవినీతి ఆరోపణలు న్న వ్యక్తిని  సలహదారులుగా  తీసుకున్నారన్నారు.  సోమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుండి  తప్పుకున్న తర్వాత  కేసీఆర్ కు ఆదాయం తగ్గిందని  ఆయన ఆరోపించారు. 

 కర్ణాటకలో బీజేసీ సర్కార్  ఏర్పాటు కానుందని  ఆయన  ఆశాభావం వ్యక్తం  చేశారు.  రాష్ట్రంలో  సమ్మె కొనసాగిస్తున్న  జూనియర్ పంచాయితీ సెక్రటరీలను  బండి సంజయ్ అభినందించారు.  జూనియర్ పంచాయితీ  సెక్రటరీలకు  బీజేపీ అండగా ఉంటుందని  ఆయన  హామీ ఇచ్చారు. పంచాయితీ సెక్రటరీలను  ప్రభుత్వం బెదిరిస్తుందన్నారు. 

 

click me!