రామప్ప ఆలయంలో రాహుల్ , ప్రియాంక ప్రత్యేక పూజలు .. కాసేపట్లో మహిళా డిక్లరేషన్

By Siva Kodati  |  First Published Oct 18, 2023, 5:13 PM IST

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ప్రఖ్యాత రామప్ప ఆలయాన్ని సందర్శించారు .  కాసేపట్లో వీరిద్దరూ ములుగు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అదే వేదికపై మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్నారు. 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తొలి విడత బస్సు యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ప్రఖ్యాత రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రామప్ప దేవాలయంలో వీరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని శిల్పాలను వీరిద్దరూ చూసి, ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. కాసేపట్లో వీరిద్దరూ ములుగు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అదే వేదికపై మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్నారు. అనంతరం రాహుల్, ప్రియాంకాలు తొలి విడత బస్సు యాత్రను ప్రారంభించనున్నారు . 

కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ప్రచార కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేసింది. మూడు విడతల్లో బస్సు యాత్రలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది.  18 నుంచి తొలి దశ.. దసరా తర్వాత రెండో దశ.. నామినేషన్ల ప్రక్రియ తర్వాత మూడో దశ యాత్ర జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే వెల్లడించారు.

Latest Videos

ALso Read: నేటి నుండి తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్ర: కలిసొచ్చేనా?

18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత బస్సు యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారని థాక్రే తెలిపారు. ములుగు నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని.. ఆ తర్వాత పెద్దపల్లిలో భారీ బహిరంగ సభ వుంటుందని ఆయన వెల్లడించారు. అనంతరం కరీంనగర్‌లో పాదయాత్ర, బహిరంగ సభ వుంటాయని , జగిత్యాలలో రైతులతో రాహుల్ సంభాషిస్తారని థాక్రే చెప్పారు. నిజామాబాద్‌లో పాదయాత్ర , బహిరంగ సభ.. ఆర్మూర్‌లో రైతులతో రాహుల్ గాంధీ సమావేశం అవుతారని మాణిక్ రావు థాక్రే చెప్పారు. 
 

click me!