రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల తెలంగాణ పర్యటనపై మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . తెలంగాణ వెనుకబడిపోవడానికి కారణం కాంగ్రెస్సేనని.. తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల తెలంగాణ పర్యటనపై మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వెనుకబడిపోవడానికి కారణం కాంగ్రెస్సేనన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పి వెనక్కి వెళ్లడంతో ఆనాడు యువత ఆత్మహత్య చేసుకుందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. తెలంగాణకు వచ్చిన ఒక కాంగ్రెస్ మంత్రి హోటల్‌లో డబ్బులు వెదజల్లి ఎంజాయ్ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని.. రాహుల్ ఏ మొహం పెట్టుకుని తెలంగాణ వస్తున్నారని ఆయన నిలదీశారు. కర్ణాటకలో కాంగ్రెస్ డబ్బులు వసూలు చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఇకపోతే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలని జనసేన పార్టీని బీజేపీ కోరింది. వివరాలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని పవన్‌ను కోరారు. అయితే జనసేన నాయకుల మనోగతాన్ని పవన్ కల్యాణ్.. బీజేపీ నేతలకు వివరించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామని, బీజేపీ నాయకుల కోరిక మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి తప్పుకుని బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశామని చెప్పారు.
ALso Read: నిన్ను ‘కుక్కా’ అన్నా సింపతీ రాదు.. కవితపై అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బ తింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని పవన్ బీజేపీ నాయకులకు తెలియజేసినట్టుగా జనసేన పార్టీ తెలిపింది. రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసే విషయమై ఒకటి రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక, ప్రస్తుతం ఎన్డీయేలో జనసేన భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఏపీలో టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ ప్రకటన తర్వాత.. జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్దమైనట్టుగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. అయితే తాజాగా తెలంగాణ జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణాలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలా? లేదా ? అనే విషయంపై జన కార్యకర్తల, నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు.