వలస కూలీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు వి. హనుమంతరావు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు ఆదివారం నాడు గాంధీ భవన్ లో దీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: వలస కూలీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు వి. హనుమంతరావు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు ఆదివారం నాడు గాంధీ భవన్ లో దీక్ష నిర్వహించారు.
వలస కార్మికుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.ఈ విషయమై వలస కార్మికులను ఆదుకోవాలని కోరుతూ గాంధీ భవన్ లో ఇవాళ ఉదయం పదకొండున్నర గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వి. హనుమంత రావు, జగ్గారెడ్డి దీక్షకు దిగారు.
రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో అలసత్వాన్ని నిరసిస్తూ ఇటీవలనే తన నివాసంలోనే వి.హనుమంతరావు దీక్షకు దిగిన విషయం తెలిసిందే.
undefined
also read:లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: కాంగ్రెస్ నేత వీహెచ్‌పై కేసు నమోదు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరో వైపు నాలుగో విడత లాక్ డౌన్ కొత్త మార్గదర్శకాలతో అమలు చేయనున్నట్టుగా ప్రధాని మోడీ ప్రకటించారు.
లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు తమ స్వంత గ్రామాలకు వెళ్లేందుకు వందలాది మంది వలస కార్మికులు కాలినడకనే ఇంటికి బయలుదేరారు. ఇళ్లకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో కొందరు వలస కార్మికులు మరణించారు.మరికొందరు స్వంత గ్రామాలకు వెళ్తూ మార్గమధ్యలో అనారోగ్యానికి గురై మరణించిన విషయం తెలిసిందే.