గాంధీ భవన్ కి కామారెడ్డి కాంగ్రెస్ పంచాయితీ: నేడు క్రమశిక్షణ సంఘం ముందుకి మదన్ మోహన్ రావు

Published : May 18, 2022, 10:14 AM ISTUpdated : May 18, 2022, 11:42 AM IST
గాంధీ భవన్ కి కామారెడ్డి కాంగ్రెస్ పంచాయితీ: నేడు క్రమశిక్షణ సంఘం ముందుకి  మదన్ మోహన్ రావు

సారాంశం

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల వర్గపోరు  గాంధీ భవన్ కు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ కన్వీనర్ మదన్ మోహన్ రావు పీసీసీ  క్రమశిక్షణ సంఘం ముందు ఇవాళ హాజరుకానున్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై మదన్ మోహన్ రావు క్రమశిక్షణ సంఘానికి వివరణ ఇవ్వనున్నారు.

హైదరాబాద్: Kama Reddy జిల్లాకు చెందిన Congress పార్టీ నేతల మధ్య వర్గపోరు Gandhi Bhavan కు చేరింది. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ విభాగం చైర్మెన్ Madan Mohan Rao ఇవాళ పీసీసీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరుకానున్నారు.

మదన్ మోహన్ రావు పార్టీ జిల్లా నాయకత్వానికి తెలియకుండా ఏకపక్షంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు Srinivas ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయమై మదన్ మోహన్ రావును పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 22న ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం జిల్లా Congress పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది.

మదన్ మోహన్ రావును పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని PCC తప్పుబట్టింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ Mahesh Kumar Goud కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు Srinivas కు ఈ ఏడాది ఏప్రిల్ 24న షోకాజ్ నోటీసు పంపారు.

అయితే పార్టీ అనుమతి లేకుండా మదన్ మోహన్ రావు  పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని  కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మదన్ మోహన్ రావు ఇవాళ పీసీసీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కానున్నారు.

2014, 2019 ఎన్నికల్లో  జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుండి మదన్ మోహన్ రావు పోటీ చేశారు. 2014లో జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా, 2019లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.  ఇటీవల కాలంలో ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై కేంద్రీకరించి పనిచేస్తున్నారు. 

also read:48 గంటల్లో వివరణ ఇవ్వాలి:మదన్ మోహన్ రావు సస్పెన్షన్ పై డీసీసీకి పీసీసీ నోటీస్

నిజామాబాద్ జిల్లా నుండి మదన్ మోహన్ రావు పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. ది. జిల్లా వ్యాప్తంగా తన వర్గాన్ని ఏర్పాటు మదన్ మోహన్ రావు ఏర్పాటు చేసుకొంటున్నారు. బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకొంటున్నారనే మదన్ మోహన్ రావుపై ప్రత్యర్ధి వర్గం ఆరోపణలు చేస్తుంది.

కామారెడ్డిలో ఇటీవల జాబ్ మేళాను మదన్ మోహన్ రావు నిర్వహించారు.ఈ జాబ్ మేళాకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ వర్గానికి తెలియకుండానే నిర్వహించారని ఆ వర్గం గుర్రుగా ఉంది. అంతేకాదు ఈ జాబ్ మేళాకు అజహరుద్దీన్ ను కూడా రప్పించడం కూడా వైరి వర్గాన్ని తీవ్ర ఆగ్రహన్ని తెప్పించింది. 

జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీచేసిన కె.మదన్‌మోహన్‌రావును పార్టీ లైన్‌ దాట వద్దని క్రమశిక్షణ సంఘం గతంలోనే హెచ్చరించింది.  ఈ నెల 2న నిర్వహించిన కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సమావేశంలో  మదన్ మోహన్ రావుకి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

 పార్టీ పేరుతో కాకుండా మదన్‌ యూత్‌ ఫోర్స్‌ పేరుతో కార్యక్రమాలు చేయడం, పార్టీ నాయకత్వానికి సమాచారం లేకుండానే ఎల్లారెడ్డిలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేయడం వంటివి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ప్రస్తావించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలంటూ క్రమశిక్షణ సంఘం ఆయనకు లేఖ పంపింది. మదన్‌మోహన్‌ను సస్పెండ్‌ చేసిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌కు ఆ అధికారం లేదని క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడింది. డీసీసీ అధ్యక్షులకు వచ్చే ఫిర్యాదులను రాష్ట్ర కమిటీకి తెలపాలి. అలా నేరుగా సస్పెండ్‌ చేయవద్దంటూ ఆయనకు కూడా లేఖ రాసింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్