పద్మశ్రీ వనజీవి రామయ్యకు ప్రమాదం:ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స

By narsimha lode  |  First Published May 18, 2022, 9:18 AM IST

ఖమ్మంలో పద్మశ్రీ వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమదంలో రామయ్యకు గాయాలయ్యాయి. రామయ్యను ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 


ఖమ్మం:పద్మశ్రీ  Vanajeevi  Ramaiah కు ఖమ్మంలో బుధవారం నాడు రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను Khammam ప్రభుత్వాసుపత్రి ICUలో చేర్పించి చికిత్స అందుతున్నారు.  మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Latest Videos

undefined

ఇవాళ ఉదయం పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు రామయ్య తన Bike పై వెళ్లాడు. ఈ సమయంలో రోడ్డు దాటుతుండగా మరో బైక్ వచ్చి రామయ్యను ఢీకొట్టింది. దీంతో ఆయన గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానికులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఇప్పటికే వనజీవి రామయ్య అనారోగ్యంగా ఉన్నాడు. కాలికి గాయమైంది. కాలికి సర్జరీ చేయాలని కూడా వైద్యులు సూచించారు. ఈ తరుణంలో  ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో రామయ్య తలకు గాయమైంది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోని ఐసీయూలో రామయ్యకు చికిత్స అందిస్తున్నారు. 

2019 మార్చిలో వనజీవి రామయ్య  రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.  మార్చి 30న  తన మనమరాలిని చూసి బైక్ పై వెళ్తున్న రామయ్యను మున్సిపల్ కార్యాలయం వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో వనజీవి రామయ్యను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత రామయ్య కోలుకొన్నారు.

ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం పంచాయితీలోని, మారమ్మగుడి వద్ద మొక్కలకు నీరు పోసెందుకు రోడ్డుపైకి వచ్చిన పద్మశ్రీ వనజీవి రామయ్య గారికి ప్రమాదం జరగడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు విచారం వ్యక్తం చేశారు. 

విషయం తెలుసుకున్న మంత్రి పువ్వాడ రామయ్య కు మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని మంత్రి అదేశించారు. అనంతరం రామయ్య ఆరోగ్య పరిస్థితి గూర్చి మంత్రి ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

వనజీవి రామయ్య  ప్రమాదానికి గురైన విషయం తెలుసుకుని తక్షణమే  వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యాధికారులతో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. రామయ్య కు సరైన చికిత్స అందించాలని ఆదేశించారు. 

రామయ్యను  అన్ని విధాలుగా అండగా ఉంటామని రామయ్య కుటుంబ సభ్యులకు  మంత్రి హరీష్ రావు  హామీ ఇచ్చారు.రామయ్య  కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన  ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు మంత్రి హరీష్ రావుకు వివరించారు.ఎప్పటికప్పుడు రామయ్య ఆరోగ్య సమాచారం అందించాలని  మంత్రి ఆదేశించారు.

also read:పెళ్లి వేడుక నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

మొక్కల పెంపకంపై రామయ్య ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటాడు. దీంతో ఆయనను వనజీవి రామయ్యగా పిలుస్తుంటారు.మొక్కల పెంపకం కోసం రామయ్య చేస్తున్న కృషికి గాను రామయ్యకు పద్మశ్రీ అవార్డును ఇచ్చింది ప్రభుత్వం.వేసవి కాలంలో అటవీ ప్రాంతంలో రకరకాల గింజలు సేకరిస్తారు. వర్షాకాలంలో వీటిని రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాల్లో నాటుతారు. 

2017లో రామయ్యకు కేంద్రం పద్మశ్రీ అవార్డును ఇచ్చింది. సుమారు 120 రకాల మొక్కల చరిత్రను రామయ్య చెబుతారు. రామయ్య జీవిత చరిత్రను తెలంగాణ ప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చింది.

ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి రామయ్య స్వగ్రామం. రామయ్య ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. మత్తగూడెం స్కూల్లో టీచర్ మల్లేషం బోధించిన మొక్కల పెంపకంతో లాభాలు రామయ్య జీవితాన్ని ప్రభావితం చేశాయి. తొలుత తన ఇంట్లో మొక్కలను పెంచాడు. ఆ తర్వాత ఎక్కడ ఖాళీ స్థలం కన్సిస్తే అక్కడ మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. కుండలు చేస్తూ పాలు అమ్మడం ద్వారా పొట్టపోసుకొనేవాడు రామయ్య. తన 15వ ఏటనే రామయ్య కు జానమ్మతో పెళ్లి జరిగింది. వీరికి నలుగురు పిల్లలు. 
 

click me!